Gujarath : గాంధీజీని దూషిస్తూ..‘గాడ్సే నాకు ఆదర్శం’ అన్న స్కూల్ విద్యార్థికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిన స్కూల్

గాంధీజీని దూషిస్తూ..‘గాడ్సే నాకు ఆదర్శం’అన్న స్కూల్ విద్యార్థికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది స్కూల్. దీంతో ఆ స్కూల్ తో పాటు ఇలాంటి అంశంపై పోటీ నిర్వహించిన అధికారి వివాదంలో చిక్కుకున్నారు

Gujarath : గాంధీజీని దూషిస్తూ..‘గాడ్సే నాకు ఆదర్శం’ అన్న స్కూల్ విద్యార్థికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిన స్కూల్

First Prize For A Student Who Says ‘godse Is An Ideal For Me’

Updated On : February 17, 2022 / 11:12 AM IST

First prize for a student who says ‘Godse is an ideal for me’ : భారత జాతిపిత మహాత్మాగాంధీని దూషిస్తూ..‘నాథూరం గాడ్సే నాకు ఆదర్శం’ అని మాట్లాడిన విద్యార్థికి మొదటి బహుమతి ఇచ్చి సత్కరించింది గుజరాత్ లోని ఓ స్కూల్. మహాత్మాగాంధీని చంపిన ‘గాడ్సే నాకు హీరో..ఆయన నాకురోల్ మోడల్’ అని అన్న విద్యార్థికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిన గుజరాత్‌ లోని స్కూల్ వివాదంలో చిక్కుకుంది. గుజరాత్ లోని వల్సాడ్‌ పట్టణంలోని వివాదంలో చిక్కుకొంది.

Also read  Akhilesh Yadav : పాకిస్థాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నాపై అఖిలేశ్ యాదవ్ పొగడ్తలు

విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీయటానికి ‘బాల్‌ ప్రతిభ శోధ్‌ వక్తృత్వ్‌ స్పర్ధా’ పేరుతో జిజిల్లా యువజనాభివృద్ధి అధికారి కార్యాలయం తరఫున వక్తృత్వ పోటీలను నిర్వహించారు. ఈ పోటీ్లో విద్యార్థులు మాట్లాడటానికి మూడు అంశాలు ఇచ్చారు నిర్వాహకులు. దాంట్లో ‘నాథూరాం గాడ్సే నాకు ఆదర్శం’ అన్నది ఓ అంశాన్ని పెట్టారు. ఈ పోటీల్లో మహాత్ముని దూషిస్తూ, గాడ్సేను కీర్తిస్తూ..‘గాడ్సే నా హీరో..నాకు రోల్ మోడల్ అయనే అని అభివర్ణించిన విద్యార్థినికి మొదటి ర్యాంకు ఇచ్చారు నిర్వాహకులు. ఇదికాస్తా వివాదంగా మారింది.

Also read : Godse-Apte Memorial Day : గాంధీజీ వర్ధంతి రోజున..గాడ్సేకి హిందూ మహాసభ నివాళులు..!

ఈ వివాదంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించగా..జిజిల్లా ప్రాథమిక విద్యాధికారి ఈ విషయమై దర్యాప్తు చేపట్టారు. అవార్డును జిల్లా స్థాయి పోటీలో పాల్గొన్న అధికారి, బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారిగా సబ్జెక్టులను ఎంపిక చేయడంలో శ్రద్ధ వహించలేదనే ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు.

వల్సాద్ జిల్లాకు ప్రొబేషనరీ క్లాస్-2 జిల్లా యూత్ డెవలప్‌మెంట్ అధికారి మితాబెన్ గావ్లీ విద్యా శాఖ విచారణ తర్వాత సస్పెండ్ అయ్యాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.ఈ పోటీకి గాడ్సేకు ప్రశంసలతో సహా మూడు అంశాలను ఇచ్చారు. మిగిలిన రెండు ‘నాకు ఆకాశంలో ఎగిరే పక్షులంటే ఇష్టం’, అలాగే ‘నేను సైంటిస్ట్‌ని అవుతాను కానీ యుఎస్‌కి వెళ్లను”అనే అంశాలపై ఇచ్చారు.

Also read : మ‌హాత్మాగాంధీని హ‌త‌మార్చిన గాడ్సే దేశ‌భ‌క్తుడు : లోక్‌స‌భ‌లో వ్యాఖ్యానించిన బీజేపీ ఎంపీ

బాధ్యులపై చర్యలు తీసుకుంటామని క్రీడలు, యువజన, సాంస్కృతిక కార్యక్రమాల సహాయ మంత్రి హర్ష్ సఘవి తెలిపారు. డిపార్ట్‌మెంట్ వల్సాద్ కార్యాలయంలో ఫిబ్రవరి 14న ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన వక్తృత్వ పోటీలకు టాపిక్స్‌ను ఎంపిక చేయడంలో అధికారి మరింత శ్రద్ధ వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇది మొత్తం వల్సాద్ జిల్లా నుండి 11 నుండి 13 సంవత్సరాల వయస్సు గల ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల కోసం తెరవబడింది. కాగా..ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపా ప్రభావంతోనే ఇటువంటి వక్రీకరణ జరుగుతోందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర శాఖ విమర్శించింది.