Babar Azam: క్రికెట్ చరిత్రలో భారీ రికార్డు నెలకొల్పిన పాక్ కెప్టెన్.. అదేమిటంటే?

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుస మ్యాచ్ లలో తన బ్యాటింగ్ ప్రతిభతో ప్రత్యర్థులకు చమటలు పట్టిస్తున్నాడు. ఈ క్రమంలో అతను అరుదైన రికార్డును సృష్టించాడు. గతంలో ఏ కెప్టెన్ కూ సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Babar Azam: క్రికెట్ చరిత్రలో భారీ రికార్డు నెలకొల్పిన పాక్ కెప్టెన్.. అదేమిటంటే?

Babar Azam

Updated On : June 12, 2022 / 8:31 AM IST

Babar Azam: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుస మ్యాచ్ లలో తన బ్యాటింగ్ ప్రతిభతో ప్రత్యర్థులకు చమటలు పట్టిస్తున్నాడు. ఈ క్రమంలో అతను అరుదైన రికార్డును సృష్టించాడు. గతంలో ఏ కెప్టెన్ కూ సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం వెస్టిండీస్ పై రెండో వన్డేలో 77పరుగులు సాధించడంతో ఫార్మాట్లకు అతీతంగా వరుసగా తొమ్మిది ఇన్నింగ్స్ లో 50కు పైగా సోర్లు చేశాడు. దీంతో ఈ ఘన సాధించిన ఏకైక బ్యాట్స్ మెన్ గా చరిత్రలోకెక్కాడు.

Babar Azam: కోహ్లి రికార్డును బద్దలు కొట్టిన పాక్ క్రికెటర్

మార్చి 12న ఆస్ట్రేలియా పై రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో 196 పరుగులు చేసిన బాబర్ అజామ్.. మార్చి 21న అదే ఆసీస్ పై మూడో టెస్టు రెండు ఇన్నింగ్స్ ల్లో 67, 55 పరుగులు చేశాడు. అదేవిధంగా మార్చి 29న అదే జట్టుపై తొలి వన్డేలో 57 పరుగులు, 31న  రెండో వన్డేలో 114 పరుగులు, ఏఫ్రిల్2న మూడో వన్డేలో 105(నాటౌట్) పరుగులు. ఏప్రిల్ 5న ఆస్ట్రేలియాతో ఆడిన ఏకైక టీ20 మ్యాచ్ లో 66 పరుగులు చేశాడు. ఇక జూన్ 8న వెస్టిండీస్ తో తొలి వన్డేలో 103 పరుగుల చేసిన పాక్ కెప్టెన్ ఆజామ్ 10న విండీస్ పై రెండో వన్డేలోనూ 77 పరుగులు చేశాడు. దీంతో వరుసగా తొమ్మిది మ్యాచ్ లలో కెప్టెన్ హోదాలో 50 పరుగుల స్కోరును దాటి పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ భారీ రికార్డును నెలకొల్పాడు.