Same House In Two Countries : ఒకే ఇల్లు రెండు దేశాల పరిధిలో.. బెడ్ రూమ్ భారత్ లో, కిచెన్ మాత్రం మయన్మార్ లో..

సాధారణంగా ఏదైనా ఇల్లు ఒకే ఊరు, ఒకే రాష్ట్రం, ఒకే దేశంలో ఉంటుంది. కానీ ఓ ఇల్లు మాత్రం రెండు దేశాల పరిధిలో ఉంది. ఒకే ఇంటిలోని గదులు రెండు దేశాల సరిహద్దుల్లో ఉండటం విచిత్రం. ఇల్లు మాత్రం ఒకటే..కానీ కిచెన్ లో నుంచి బెడ్ రూమ్ లోకి వెళ్లాలంటే మాత్రం దేశ సరిహద్దులు దాటాల్సిందే.

Same House In Two Countries : ఒకే ఇల్లు రెండు దేశాల పరిధిలో.. బెడ్ రూమ్ భారత్ లో, కిచెన్ మాత్రం మయన్మార్ లో..

house

Updated On : January 14, 2023 / 12:38 PM IST

Same House In Two Countries : సాధారణంగా ఏదైనా ఇల్లు ఒకే ఊరు, ఒకే రాష్ట్రం, ఒకే దేశంలో ఉంటుంది. కానీ ఓ ఇల్లు మాత్రం రెండు దేశాల పరిధిలో ఉంది. ఒకే ఇంటిలోని గదులు రెండు దేశాల సరిహద్దుల్లో ఉండటం విచిత్రం. ఇల్లు మాత్రం ఒకటే..కానీ కిచెన్ లో నుంచి బెడ్ రూమ్ లోకి వెళ్లాలంటే మాత్రం దేశ సరిహద్దులు దాటాల్సిందే. బెడ్ రూమ్ భారత్ లో ఉంటే కిచెన్ మాత్రం మయన్నార్ లో ఉంది. విచిత్రంగా ఉన్నా ఇది నిజం.  నాగాలాండ్ లోని మోన్ జిల్లాలో ఉన్న అతి పెద్ద గ్రామాల్లో లాంగ్వా ఒకటి.

నాగాలాండ్ రాజధాని కొహిమాకు 380 కిలో మీటర్ల దూరంలో లాంగ్వా ఉంటుంది. భారత్-మయన్మార్ సరిహద్దులో ఈ గ్రామం ఉండటమే దీనికున్న ప్రత్యేకత. లాంగ్వాలో కొన్యాక్ నాగా తెగకు చెందిన వారే ఎక్కువగా నివసిస్తారు. ఈ తెగకు ఆంగ్ అనే వ్యక్తి అధిపతిగా వ్యవహరిస్తుంటారు. అయితే, ఆంగ్ నివసించే ఇల్లు మాత్రం భారత్-మయన్మార్ ను వేరు చేస్తుంది.

Viral House : ఈ ఇంటి ముందు డోర్ పంజాబ్‌లో..వెనుక డోర్ హర్యానాలో తెరుచుకుంటాయి

ఇంట్లోని కిచెన్ మయన్మార్ లో ఉంటే బెడ్ రూమ్ మాత్రం భారత్ లో ఉండటం విశేషం. ఈ ఇంటికి సంబంధించిన వీడియోను నాగాలాండ్ మంత్రి టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘ఆ కుంటుంబ సభ్యులు భారత్ లో పడుకుంటారు.. మయన్మార్ లో తింటారు’.. అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.