ఇద్దరు చిన్నారుల చికిత్స రూ. 32 కోట్లు, రూ. 22 కోట్ల ఇంజెక్షన్

Rs. 32 crore : ఇద్దరు చిన్నారులు జన్యు సంబంధ సమస్యతో బాధ పడుతున్నారు..చికిత్సకు వేలు కాదు..లక్షలు కాదు..కోట్లు ఖర్చు కానున్నాయి. కానీ..అంత డబ్బు ఆ తల్లిదండ్రుల దగ్గర లేదు. దీంతో..ఆపన్న హస్తాలు ఆదుకున్నాయి. ఒక చిన్నారి లాటరీ ద్వారా చికిత్సకు ఎంపిక కాగా..రెండో పాపకు ప్రపంచ వ్యాప్తంగా…దాతలు ఏకంగా..రూ. 16 కోట్లు సమకూర్చారు. స్పైనల్ మస్క్యులర్ ఆటోఫీ (SMS) పట్టి పీడిస్తోంది. దీనివల్ల కండరాలు క్షీణిస్తాయి. బెంగళూరుకు చెందిన మహ్మద్ బాసిల్, ఖదీజా దంపతుల కుమార్తె ఫాతిమా (14 నెలలు) ఎస్ఎంఏతో బాధ పడుతోంది.
జోల్గెన్ స్మా అనే జన్యు చికిత్స ద్వారానే నయం అవుతుందని వైద్యులు వెల్లడించారు. ఈ చికిత్సకు దాదాపు రూ. 16 కోట్లు ఖర్చు కానుండగా..బెంగళూరుకు చెందిన బాప్టిస్ట్ ఆసుపత్రి ఈ చికిత్సను చేసేందుకు ముందుకొచ్చింది. ప్రముఖ ఔషధ సంస్థ నోవార్టిన్ సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా లాటరీ ద్వారా ఈ చిన్నారిని ఎంపిక చేసి చికిత్స చేయించారు. మంగళవారం ఈ ఖరీదైన మందులను చిన్నారికి అందించినట్లు ఆసుపత్రి సీఈవో డాక్టర్ నీవీన్ థామస్ వెల్లడించారు.
ఇక ముంబాయిలో నివాసం ఉండే టిరా కామత్ (5 నెలలు) అనే మరో చిన్నారికి కూడా ఎంఎస్ఏ వ్యాధితో బాధ పడుతోంది. చికిత్సలో భాగంగా రూ. 22 కోట్ల విలువైన ఇంజెక్షన్ ను ఇవ్వాల్సి ఉంటుంది. అంత డబ్బు చెల్లించలేని పరిస్థితిలో తల్లిదండ్రులున్నారు.
దీంతో వారు పాపను కాపాడుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా విరాళాలు ఆర్థించారు. ఇంపాక్ట్ గురు అనే క్రౌడ్ ఫండింగ్ వెబ్ సైట్ సాయాన్ని కోరారు. భారత్, కెనడా, ఆస్ట్రేలియాతో సహా..పది దేశాల దాతలు స్పందించారు. ఒక్కొక్కరు రూ. 100 నుంచి రూ. 5 లక్షలు వరకు ఇచ్చారు. మొత్తం రూ. 16 కోట్లు సమకూరాయి. కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి..ఈ ఇంజెక్షన్ పై రూ. 6 కోట్ల విలువైన పన్నును రద్దు చేసింది. ఒకరి కోసం ఇంత భారీ స్థాయిలో క్రౌడ్ ఫండింగ్ జరగలేదని, దాతలు సరాసరి రూ. 1750 చొప్పున విరాళంగా ఇచ్చారని ఇంపాక్ట్ గురు సంస్థ సీఈవో పీయూష్ జైన్ వెల్లడించారు.