Salary of ISRO Chairman : ఇస్రో చైర్మన్ సోమనాథ్ జీతం ఎంతో తెలుసా.. అలవెన్స్‌లు అన్నీ కలిపి ఎంతంటే?

ఎస్.సోమనాథ్ ప్రముఖ రాకెట్ శాస్త్రవేత్త. ఇస్రో చైర్మన్. PSLV, GSLV, LVM3 వంటి పలు ప్రయోగాల్లో వాహనాల రూపకల్పనలో ఆయన దోహదపడ్డారు. అయితే ఆయన జీతం ఎంత? ఇచ్చే ప్రోత్సాహకాలు..ప్రయోజనాలు ఏంటి?

Salary of ISRO Chairman

ISRO Chairman Salary : చంద్రయాన్ 3 ప్రయోగం వేళ ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి? ఆయన నెలసరి వేతనం ఎంత ఉంటుంది? తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి కనపరుస్తున్నారు.

ఎస్.సోమనాథ్ కేరళలోని తురవూరులో 1963 లో జన్మించారు. కొల్లంలోని TKLM కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశాకా బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పొందారు. గ్రాడ్యుయేషన్ తర్వాత సోమనాథ్ 1985 లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో చేరారు. 2010 లో ఈ సెంటర్‌కు అసోసియేట్ డైరెక్టర్ అయ్యారు. కె.శివన్ నుండి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. జనవరి 2022 లో కె.శివన్ తర్వాత మళ్లీ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

సోమనాథ్ ఏరో స్పేస్ ఇంజనీర్, సాంకేతికత నిపుణులు. PSLV, GSLV, LVM3 వంటి పలు ప్రయోగాల్లో వాహనాల రూపకల్పనలో ఆయన దోహదపడ్డారు. అయితే ఆయన జీతం ఎంత? ఇచ్చే ప్రోత్సాహకాలు.. ప్రయోజనాలు ఏంటి అనేవి తెలుసుకోవాలనే కుతూహలం చాలామందిలో ఉంది. ఇస్రో చైర్మన్ జీతం అక్షరాల 2.5 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ఇది బేసిక్ పే గా తెలుస్తోంది. ఇతర అలవెన్స్‌లు అన్నీ కలిపి రూ.10 లక్షలు దాటొచ్చునట. ఆయనకు భారీ భద్రత కూడా ఉంటుంది.

ISRO Heroes : బెంగళూరులో ఇస్రో హీరోలను కలవనున్న ప్రధాని మోదీ

ఇస్రో చైర్మన్‌కు బెంగళూరులో విశాలమైన, సకల సౌకర్యాలు ఉన్న అధికారిక నివాసాన్ని ఇస్తారు. అధికారిక, వ్యక్తిగత అవసరాల కోసం డ్రైవర్‌తో కూడిన అధికారిక వాహనం ఉంటుంది. భారత దేశంలో లేదా విదేశాలలో తన అధికారిక విధులు లేదా వ్యక్తిగత పర్యటనల కోసం ఫ్లైట్ లేదా ట్రైన్‌లో ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ఫస్ట్ క్లాస్ లేదా బిజినెస్ క్లాస్ టిక్కెట్లు పొందవచ్చును. అవసరమైన సమయాల్లో చార్టర్డ్ ఫ్లైట్ లేదా హెలికాప్టర్లను కూడా ఉపయోగించుకోవచ్చును.

Chandrayaan 3 success : ఇస్రో చీఫ్‌కు సోనియాగాంధీ అభినందన లేఖ

ఇస్రో చైర్మన్ ఆయన కుటుంబ సభ్యులు భారతదేశంలో లేదా విదేశాల్లో ఏదైనా ప్రభుత్వ లేదా ఎంపానెల్ ఆసుపత్రిలో ఉచిత వైద్య చికిత్స తీసుకోవచ్చును. వైద్య పరీక్షలు, మెడిసిన్స్ కోసం అయ్యే ఖర్చులను కూడా రీయింబర్స్‌మెంట్  క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. ఇస్రో చైర్మన్ 65 సంవత్సరాల వయసులో లేదా ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన ఏది ముందుగా ఉంటే అది పదవీ విరమణ చేయవచ్చును. పదవీ విరమణ తర్వాత ఆయన చివరగా డ్రా చేసిన బేసిక్ పే , డియర్‌నెస్ అలవెన్స్‌లో 50% కి సమానమైన పెన్షన్ పొందుతారు. ఇస్రో చైర్మన్ పదవి అంటే భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రభావవంతమైన పదవుల్లో ఒకటి. దేశానికి ప్రయోజనం చేకూర్చే ఎన్నో అంతరిక్ష పరిశోధనలపై ఎంతోమంది శాస్త్రవేత్తలతో ఆయన పనిచేస్తారు. నాయకత్వం వహిస్తారు. వృత్తిలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న సోమనాథ్ అత్యున్నతమైన పదవిలో ఉండి ఆగస్టు 23 2023 న చంద్రయాన్ 2 సాఫ్ట్ ల్యాండింగ్‌కు నాయకత్వం వహించారు.

Chandrayaan-3 : చంద్రుడిపై నడచిన భారత్… ఇస్రో కీలక ట్వీట్