Rajasthan : ‘బీజేపీ నేత‌లు రామ భ‌క్తులు కాదు..రావ‌ణాసురుడి భ‌క్తులు : మంత్రి విమర్శలు

‘బీజేపీ నేత‌లు రామ భ‌క్తులు కాదు..రావ‌ణాసురుడి భ‌క్తులు అంటూ మంత్రి వివాదాస్పద విమర్శలు చేశారు.

Bjp Leaders Ravan Bhakts Say Rajasthan Minister Pratap Singh Khachariyawas

రాజ‌స్థాన్ మంత్రి ప్ర‌తాప్ సింగ్ క‌చ‌రియావాస్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఇంధ‌న ధ‌ర‌ల‌ను పెంచిన కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ‘బీజేపీ నేత‌లు రాముడి భ‌క్తులు కాద‌ు రావ‌ణాషుడికి భ‌క్తులు’ అంటూ రాజ‌స్థాన్ మంత్రి ప్ర‌తాప్ సింగ్ క‌చ‌రియావాస్ ( Pratap Singh Khachariyawas)వివాదాస్పద విమర్శలు చేశారు. సోమవారం (మార్చి28,2022) జైపూర్‌లో మంత్రి ప్రతాప్ సింగ్ పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదల గురించి మాట్లాడుతూ.. ‘ది క‌శ్మీర్ ఫైల్స్’ (“The Kashmir Files”.) సినిమా కోసం ఎలా టికెట్ల‌ను పంచిపెడుతున్నారో అలాగే పెట్రోల్‌, డీజిల్ కోసం కూడా కూప‌న్లు పంచి పెట్టాల‌ని డిమాండ్ చేశారు.

Also read : BJP MLA: నాకు ఓటు వేయనివారిది ముస్లింల రక్తమే.. -బీజేపీ ఎమ్మెల్యే

‘బీజేపీ నేత‌ల రాముడి భక్తులమని చెప్పుకుంటారని..కానీ రాముడి విధానాన్ని పాటిచ‌డం లేద‌ని, వాళ్లు రావ‌ణుడి పాల‌సీని పాటిస్తున్నార‌ు..రావ‌ణుడు ఓ మోస‌గాడు అని..నీ రాముడు ఎవ‌ర్నీ మోసం చేయ‌లేద‌ని, ప్ర‌తి ఒక్క‌ర్నీ రాముడు స‌మానంగా చూశాడు‘ అంటూ బీజేపీపై విరుచుకుపడ్డారు. పెట్రోల్, డీజిల్ రేట్లను పదే పదే పెంచుకుంటో పోతున్నారని..ఇది సామాన్యులకు పెను భారంగా మారుతోంది అని కానీ బీజేపీకి ఇదేమి పట్టదని విమర్శించారు. గత వారం రోజుల్లో పెట్రోల్, డిజీల్ రేట్లు ఏడుసార్లు పెంచారని అన్నారు. ఈరోజు కూడా (సోమవారం) పెట్రోల్‌పై 90, డీజిల్‌పై 76 పైస‌లు పెంచారు. గ‌డిచిన 8 రోజుల్లో పెట్రోల్ ధ‌ర‌ల‌ను పెంచ‌డం ఇవాళ ఏడోసారి.ఇలా పెంచుకుంటు పోవటం సరికాదు..మీకేం తెలుస్తుంది సామాన్యుడి కష్టాలేంటో అంటూ విమర్శలు సంధించారు.

Also read : MLA Raja Singh : బీజేపీకి ఓటు వేయకపోతే వారి ఇళ్లమీదకు బుల్ డోజర్లు పంపిస్తాం : ఎమ్మెల్యే రాజాసింగ్

కాగా మంగళవారం ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో లీటర్‌కు రూ. 100 మార్కు దాటేశాయి. లీటర్‌కు 80 పైసలు, డీజిల్‌పై 70 పైసలు పెంచారు, ఒక వారంలో లీటరుకు 4.80 రూపాయలకు పెరిగింది. రాష్ట్ర ఇంధన రిటైలర్ల ధర నోటిఫికేషన్ ప్రకారం, ఢిల్లీలో పెట్రోల్ ధర గతంలో రూ. 99.41 ఉండగా, డీజిల్ ధరలు లీటరుకు రూ. 90.77 నుండి రూ. 91.47కి పెరిగాయి.మార్చి 22న రేట్ల సవరణలో నాలుగున్నర నెలల సుదీర్ఘ విరామం తర్వాత ధరలు పెరగడం ఇది ఏడవసారి.

Also read : Bihar BJP : భారత్ లో ముస్లింల ఓటు హక్కు తొలగించాలి..వారు పాకిస్థాన్ వెళ్లిపోవాలి : బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్