Assam Couple Getting Free Pizza : ఆ షరతులతో పెళ్లిచేసుకున్న జంటకు ‘నెలకో పిజ్జా ఫ్రీ’ ప్రకటించిన పిజ్జాహట్

ఆసక్తికరమైన షరతులతో పెళ్లిచేసుకున్న జంటకు ‘నెలకో పిజ్జా ఫ్రీ’ ప్రకటించిన పిజ్జాహట్.

Assam Couple Getting Free Pizza : ఆ షరతులతో పెళ్లిచేసుకున్న జంటకు ‘నెలకో పిజ్జా ఫ్రీ’ ప్రకటించిన పిజ్జాహట్

Assam Couple Getting Free Pizza Every Month

Updated On : October 17, 2022 / 1:46 PM IST

Assam Couple Getting Free Pizza Every Month : తనకు కాబోయే భర్త తాను కోరినవన్నీ కొనిపెట్టాలని ఆకాంక్షిస్తుంటారు అమ్మాయిలు. కోరికలు మరీ గొంతెమ్మ కోరికలు అయితే సమస్య గానీ చిన్న చిన్న ఆనందాలు నెరవేరాలని ఆకాంక్షించటం తప్పుకాదు. అలా ఓ అమ్మాయి తన భర్తను అటువంటి చిన్న చిన్న ఆనందాలు కావాలని కోరింది. అలా ఆ అమ్మాయే కాదు అ అబ్బాయి కూడా కొన్ని షరతులు పెట్టాడు. అలా ఆ ఇద్దరి షరతులతో పెళ్లి చేసుకుని 2022 జూన్ లో భార్యాభర్తలయ్యారు. దాంపత్య జీవనంలో ఎవరు ఎలా ఉండాలనే విషయంపై పెళ్లి వేదికపైనే వాళ్లు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. షరతులతో కూడిన పేపర్ పై ఇద్దరూ సంతకాలు చేశారు. అలా షరతులతో వివాహం చేసుకున్న ఆ జంట అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలైపోయారు.

అయితే ఈ జంట షరతుల్లో ‘పిజ్జా’కూడా ఉంది. భార్య భర్తకు పెట్టిన షరతుల్లో నెలకు ఓ పిజ్జా తినిపించాలి అని ఉంది. ఈక్రమంలో తాజాగా పిజ్జాహట్ కంపెనీకి సదరు వైరల్ జంట షరతులు తెగ నచ్చేసినట్లుంది. పైగా నెలకో పిజ్జా తినిపించాలని షరతు కదా..అందుకే పిజ్జాహట్ సంస్థ కర్వాఛౌత్ సందర్భంగా ఆ జంటకు ఓ చక్కటి ఆఫర్ ప్రకటించింది. నెలకు ఓ పిజ్జా ఉచితంగా ఇస్తాం అంటూ ప్రకటించింది కర్వా చౌత్ సందర్భంగా.. “మీ భర్తతో సుదీర్ఘమైన మరియు సంతోషకరమైన జీవితానికి నెలకు ఒక పిజ్జా’ అంటూ ఏడాది పాటు తమ బ్రాంచిలలో నెలకు ఒక పిజ్జా తీసుకోవచ్చని ప్రకటించింది…

అసోంకు చెందిన మింటూ రాయ్ 2022 జూన్ లో శాంతి ప్రసాద్ ని వివాహం చేసుకుంది. దాంపత్య జీవనంలో ఎవరు ఎలా ఉండాలనే విషయంపై పెళ్లి వేదికపైనే మింటూ, శాంతి ప్రకసాదులు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. షరతులతో కూడిన పేపర్ పై ఇద్దరూ సంతకాలు చేశారు. భర్తకు పలు షరతులు విధించిన భార్య మింటూ… వారానికి ఒక సినిమా,15 రోజులకు ఒకసారి షాపింగ్, నెలకు ఒక పిజ్జా తినిపించాలనే షరతులతో పాటు పలు ఒప్పందాలు చేసుకున్నారా జంట. పెళ్లి వేదికపైన స్నేహితులు, బంధువుల మధ్య షరతుల పత్రంపై సంతకాలు చేయడం అప్పట్లో వైరల్ గా మారింది. ఆ జంట కొంతకాలం సోషల్ మీడియాలో సెలబ్రిటీల హోదా అనుభవించారు. అలా షరతుల జంటకు నెలకో పిజ్జా ఫ్రీగా ఇస్తామని ప్రటించింది పిజ్జాహట్ కంపెనీ. పిజ్జా హట్ ఇండియా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఈ జంట తమ అవుట్‌లెట్‌లలో ఒకదానికి వచ్చి పిజ్జాలను ఆస్వాదిస్తున్న వీడియోను షేర్ చేసింది.