Urban Farming: తన మూడంతస్థుల ఇంటిలో 10,000 మొక్కలు పెంచుతున్న ఉత్తరప్రదేశ్ వాసి

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం..తన మూడంతస్థుల భవనంలో ఏకంగా పది వేల మొక్కలను పెంచుతున్నాడు. బెండకాయ, మిరపకాయలు, క్యాప్సికమ్, సొరకాయ, టమోటాలు, కాలీఫ్లవర్, బచ్చలికూర, క్యాబేజీ, స్ట్రాబెర్రీ, మెంతులు మరియు పచ్చి బఠానీ మొక్కలు పెంచుతున్నాడు

Urban Farming: తన మూడంతస్థుల ఇంటిలో 10,000 మొక్కలు పెంచుతున్న ఉత్తరప్రదేశ్ వాసి

Ramveer

Updated On : May 31, 2022 / 12:35 PM IST

Urban Farming: అర్బన్ ఫార్మింగ్(నగరాల్లో సేద్యం) ఈ మధ్య కాలంలో తరచూ వినిపిస్తున్న పదం. గ్రామాల్లోని పొలాల నుంచి పండించిన పంటలపై ఆధార పడకుండా..తామే స్వయంగా కూరగాయలు పండించుకునే కొందరు నగర ప్రజలు..ఈ అర్బన్ ఫార్మింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే నగరాల్లోని నివాసాల్లో ఉండే స్థల పరిమితి కారణంగా కొన్ని మొక్కలనే పండించుకుంటున్నారు. కానీ ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం..తన మూడంతస్థుల భవనంలో ఏకంగా పది వేల మొక్కలను పెంచుతున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని బరేలీకి చెందిన రాంవీర్ సింగ్ అనే వ్యక్తి..’ది బెటర్ ఇండియా (The Better India)’ అనే వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో..తన అర్బన్ ఫార్మింగ్ గురించి, సాగు విధానం గురించి వివరించాడు.

other stories: No Religion-No Caste child: తమిళనాడులో తొలిసారి..మూడున్నరేళ్ల చిన్నారికి ‘కుల, మత రహిత ధ్రువీకరణ పత్రం’జారీ

ఈ ఆలోచన ఎందుకు వచ్చింది:
రాంవీర్ సింగ్ స్నేహితుడి తండ్రి క్యాన్సర్ భారిన పడ్డాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు..తాను తీసుకునే కూరగాయల్లో విషపదార్ధాలు అధికంగా ఉండడంతో శరీరంలో క్యాన్సర్ పేరుకుపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఇది విన్న రాంవీర్ సింగ్ ఆలోచనలో పడ్డాడు. మనకు వచ్చే ఆహార పదార్ధాలు ఎక్కడ పండించినవో తెలియకుండానే వాటిని కొనుక్కుతింటున్నం. ఆ ఆహార పదార్ధాలే మనుషుల పట్ల విషంగా మారుతున్నాయన్న భావనతో తన కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశాడు రాంవీర్. ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి బరేలికి 40 కిలోమీటర్ల దూరంలోని తన స్వగ్రామంలో కొంత పొలం తీసుకున్న రాంవీర్, అక్కడ ఆర్గానిక్ పద్ధతుల్లో కూరగాయలు పండించడం ప్రారంభించాడు. అక్కడ పంటలు బాగానే పండడంతో కొంత మొత్తంలో కూరగాయలను స్థానికంగా అమ్మడం ప్రారంభించాడు. అయితే ఆర్గానిక్ విధానంతో కొంత ఖర్చు, శ్రమ ఎక్కువ అవుతుందని గ్రహించాడు రాంవీర్ సింగ్.

Ramveer2

హైడ్రోపోనిక్స్ సాగు విధానంపై ద్రుష్టి:
ఆర్గానిక్ పద్ధతుల్లో వ్యవసాయం బాగానే ఉన్నా ఎల్లకాలం అది కొనసాగించలేమని భావించిన రాంవీర్ సింగ్.. అనుకోకుండా ఒకసారి హైడ్రోపోనిక్స్ సాగు విధానం గురించి విన్నాడు. 2017-18 మధ్య దుబాయ్ లో జరిగిన వ్యవసాయ కార్యక్రమంలో పాల్గొన్న అతను అక్కడ హైడ్రోపోనిక్స్ సాగు గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాడు. అతి తక్కువ స్థలంలో మట్టి అవసరం లేకుండానే.. కేవలం నీటి గొట్టాలు, నీరు సరఫరా ద్వారా పంటలు పండించడమే హైడ్రోపోనిక్స్ విధానం. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన రాంవీర్ సింగ్..బరేలీలోని తన ఇంటి వద్దనే ఈ తరహా సాగు చేయవచ్చని గ్రహించాడు. అనుకున్న వెంటనే హైడ్రోపోనిక్స్ సాగుకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకుని..కూరగాయల సాగు ప్రారంభించాడు.

Ramveer3

ప్రస్తుతం 10,000 కూరగాయల మొక్కలు పెంపకం:
హైడ్రోపోనిక్స్ సాగు విధానంలో ఎటువంటి పురుగుమందులు వాడకుండానే..మొక్కలు పెంచసాగాడు రాంవీర్ సింగ్. మంచి ఫలితాలు వస్తుండడంతో బరేలీలోని తన మూడు అంతస్తుల భవనం చుట్టూ సాగు విస్తీర్ణాన్ని పెంచాడు. ప్రస్తుతం 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో మొత్తం 10,000 కూరగాయల మొక్కలను పెంచుతున్నాడు రాంవీర్ సింగ్. వాటిలో బెండకాయ, మిరపకాయలు, క్యాప్సికమ్, సొరకాయ, టమోటాలు, కాలీఫ్లవర్, బచ్చలికూర, క్యాబేజీ, స్ట్రాబెర్రీ, మెంతులు మరియు పచ్చి బఠానీ మొక్కలు పెంచుతున్నాడు. న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్ (NFT) మరియు డీప్ ఫ్లో టెక్నిక్ (DFT) అనే రెండు పద్ధతుల్లో సాగు చేస్తున్న రాంవీర్..తన ఇంటిలోకి అవసరమైన కూరగాయలను ఉంచుకుని..మిగతావి స్థానికంగా అమ్ముతున్నాడు. ప్రస్తుతం అతని ఆదాయం కూడా లక్షల్లోనే ఉన్నట్టు తెలిపాడు రాంవీర్ సింగ్.

other stories: Russia Ukraine War: రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇప్పుడేం జరుగుతుంది