Russia Ukraine War: రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇప్పుడేం జరుగుతుంది

రష్యాపై ఆంక్షలు మరింత కఠినతరం చేసిన యూరోపియన్ సమాఖ్య.. రష్యా నుంచి చమురు దిగుమతులను రద్దు చేసుకునేందుకు ప్రతిపాదనలు చేసింది.

Russia Ukraine War: రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇప్పుడేం జరుగుతుంది

Russia

Russia Ukraine War: యుక్రెయిన్ – రష్యా యుద్ధం గత మూడు నెలలుగా కొనసాగుతూనే ఉంది. మొదట్లో అంతా రష్యాకు అనుకూలంగానే ఉన్న యుద్ధ పరిస్థితులు క్రమంగా అదుపుతప్పినట్లు తెలుస్తుంది. యుద్ధం ప్రారంభం అయిన నాటి నుంచి అనేక పశ్చిమ దేశాలు రష్యాపై ఆర్ధిక, దౌత్య పరమైన ఆంక్షలు విదిస్తూనే ఉన్నాయి. ఈక్రమంలో గత మూడు నెలలుగా చోటుచేసుకున్న పరిణామాలు ఎలా ఉన్నాయంటే: యుక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని డాన్‌బాస్ ప్రాంతంపై రష్యా పట్టు బిగించింది, ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఎంతో కఠినంగా ఉన్నట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. అదే సమయంలో రష్యాపై ఆంక్షలు మరింత కఠినతరం చేసిన యూరోపియన్ సమాఖ్య.. రష్యా నుంచి చమురు దిగుమతులను రద్దు చేసుకునేందుకు ప్రతిపాదనలు చేసింది. సోమవారం యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మిచెల్ మాట్లాడుతూ నిషేధం రష్యా నుండి మూడింట రెండు వంతుల చమురు దిగుమతులను తక్షణమే రద్దు చేయడంతో వారు ఉపయోగించే యుద్ధ సామాగ్రికి ఆర్థిక వనరులను నిలిపివేసినట్టు అవుతుందని పేర్కొన్నారు.

other stories: Indian railway: దిగొచ్చిన రైల్వేశాఖ.. రూ.35కోసం ఓ వ్యక్తి ఐదేళ్లుగా పోరాటం.. 3లక్షల మందికి లబ్ధి..

ఒక్క హంగేరీ మినహా ఈయూ సంఖ్యలో మిగతా అన్ని దేశాలు రష్యా నుంచి తమ దేశాలకు దిగుమతి చేసుకునే ముడి చమురులో 90 శాతాన్ని తగ్గించుకునేలా ప్రయత్నాలు మొదలుపెట్టాలని నిర్ణయించాయి. తద్వారా రష్యా సాగిస్తున్న యుద్ధ కార్యకలాపాలకు, సామాగ్రికి అవసరమైన ఆర్ధిక వనరులకు అడ్డుకట్ట వేసి.. యుద్ధం ముగించేందుకు ఒత్తిడి తేవచ్చన్నది ఈయూ ఆలోచనగా చార్లెస్ మిచెల్ పేర్కొన్నారు. అదే సమయంలో రష్యాలోని అతిపెద్ద బ్యాంక్ Sberbankను, మరో మూడు రష్యా ప్రభుత్వ బ్యాంకులను SWIFT(EU financial system) వ్యవస్థ నుంచి తొలగించేందుకు యూరోపియన్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ ఒకెత్తు అయితే..రష్యాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులు మరొక ఎత్తులా ఉన్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ మరో మూడేళ్లు మాత్రమే బ్రతుకుతాడని వైద్యులు చెప్పారని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్‌ఎస్‌బి) అధికారి ఒకరు చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కధనాలు ప్రచురించింది.

other stories: China Population: చైనాలో 60 ఏళ్లలో మొదటిసారిగా తగ్గిపోతున్న జనాభా: ప్రపంచానికి ఏ సంకేతం?

తీవ్రమైన క్యాన్సర్ తో బాధపడుతున్న పుతిన్ “సజీవంగా ఉండటానికి రెండు నుండి మూడు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం లేదు” అని FSB అధికారి చెప్పారు. ఇప్పటికే పుతిన్ కంటి చూపు మందగించిందని, కాళ్ళు చేతులు సహకరించడంలేదంటూ మీడియాలో కధనాలు వెలువడ్డాయి. మరోవైపు..యుక్రెయిన్ – రష్యా యుద్ధం ప్రారంభం అయిన నాటి నుంచి యుక్రెయిన్ కు సైనిక, ఆర్ధిక సహాయం అందిస్తూ వచ్చిన అమెరికా ప్రస్తుతం వెనకడుగు వేసింది. యుక్రెయిన్ నుంచి రష్యా వరకు ప్రవేశించగల రాకెట్ వ్యవస్థలను అమెరికా పంపబోదని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సోమవారం తెలిపారు. యుద్ధ పరిణామాలతో రష్యాలో మాంద్యం ఏర్పడింది. ఇప్పటికే రష్యాలో వ్యవసాయ ఉత్పత్తి తగ్గడంతో ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ప్రజలు ఆహార ధాన్యాల కోసం ప్రభుత్వంపై తిరగబడే అవకాశం ఉన్నందున..పెద్ద ఎత్తున ఆహార ధాన్యాల సేకరణ జరుపుతున్నారు అధికారులు.