China Population: చైనాలో 60 ఏళ్లలో మొదటిసారిగా తగ్గిపోతున్న జనాభా: ప్రపంచానికి ఏ సంకేతం?

1980ల చివరలో 2.6 శాతంగా ఉన్న సంతానోత్పత్తి రేటు..క్రమంగా తగ్గుతూ 1994లో 1.6-1.7గానూ, 2020లో 1.3 కి మరియు 2021లో కేవలం 1.15 కి పడిపోయింది.

China Population: చైనాలో 60 ఏళ్లలో మొదటిసారిగా తగ్గిపోతున్న జనాభా: ప్రపంచానికి ఏ సంకేతం?

Chinaa

China Population: జనాభా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన చైనాలో జనాభా తగ్గిపోతున్నారు. ప్రపంచ జనాభాలో ఆరవ వంతు కంటే ఎక్కువగా ఉన్న చైనా జనాభా రానున్న 80 ఏళ్లలో సగానికి తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. చైనాలో 1959-1961 నాటి మహా కరువు తర్వాత మొదటిసారిగా ఈ సంవత్సరం జనాభా వృద్ధి రేటు తగ్గుముఖం పట్టింది. చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజా గణాంకాల ప్రకారం 2021లో చైనా జనాభా 1.41212 బిలియన్ల నుండి కేవలం 1.41260 బిలియన్లకు పెరిగింది – ఇది కేవలం 480,000 పెరుగుదల. ఇది పదేళ్ల క్రితం ఎనిమిది మిలియన్ల వార్షిక వృద్ధిలో కేవలం ఒక భాగం మాత్రమే. పరిస్థితి ఇలాగె కొనసాగితే 40 ఏళ్ల అనంతరం చైనా జనాభా 660 మిలియన్ల నుండి 1.4 బిలియన్లకు పెరుగనుందని బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ అంచనా వేసింది. 1980ల చివరలో 2.6 శాతంగా ఉన్న సంతానోత్పత్తి రేటు..క్రమంగా తగ్గుతూ 1994లో 1.6-1.7గానూ, 2020లో 1.3 కి మరియు 2021లో కేవలం 1.15 కి పడిపోయింది.

పిల్లలను కనేందుకు సిద్ధంగా లేని చైనా జంటలు:

2016లో చైనా ఒక బిడ్డ విధానాన్ని రద్దు చేసి , గత సంవత్సరం పన్ను మరియు ఇతర ప్రోత్సాహకాల మద్దతుతో ముగ్గురు పిల్లల పాలసీని ప్రవేశపెట్టినప్పటికీ సంతానోత్పత్తి రేటు పడిపోవడం ఆందోళనకు గురిచేసింది. కఠినమైన కోవిడ్ నియంత్రణ చర్యల నేపథ్యంలో ప్రజలు పిల్లలను కనేందుకు ఇష్టపడకపోవడమే జననాల మందగమనానికి దోహదపడి ఉండవచ్చని భావించినా, అంతక ముందు నుంచి పరిస్థితి ఇలాగే ఉంది. చైనా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నా చైనీస్ మహిళలు పిల్లలను ఎందుకు కనడంలేదు అనే దానిపై భిన్న సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి చిన్న కుటుంబాలకు అలవాటు పడడం, మరొకటి పెరుగుతున్న జీవన వ్యయం, మరొకటి వివాహ వయస్సు పెరగడం, ఇది ప్రజల్లో సంతానోత్పత్తిని ఆలస్యం చేయడం మరియు పిల్లలను కనాలనే కోరికను తగ్గించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు చైనాలో ఊహించిన దాని కంటే తక్కువ వయస్సు గల స్త్రీలు ఉన్నారు.

జనాభా వృద్ధి రేటులో తగ్గుదల:

1980లలో ఒకే బిడ్డ విధానానికి పరిమితమై, చాలా మంది జంటలు అబ్బాయిని ఎంచుకున్నారు. ప్రతి 100 మంది బాలికలకు 106 మంది అబ్బాయిల నుండి 120కి మరియు కొన్ని ప్రావిన్సులలో 130కి పెంచారు. మహా కరువు అనంతరం చైనా మొత్తం జనాభా గత సంవత్సరం 1,000 మందిలో కేవలం 0.34 కనిష్టంగా పెరిగింది. షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్‌ అంచనా ప్రకారం ఈ సంవత్సరం వెయ్యిలో 0.49 పడిపోయింది. 2019లో చైనా అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ నివేదిక ప్రకారం 2029 నాటికి చైనాలో జనాభా 1.44 బిలియన్లకు చేరుతుందని అంచనా వేసింది. అదే సమయంలో(2019లో) యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్(UNPP) నివేదిక ప్రకారం 2031-32లో చైనా జనాభా 1.46 బిలియన్ల గరిష్ట స్థాయిని అంచనా వేసింది. 2021 తర్వాత వార్షిక సగటు 1.1 శాతం క్షీణతను అంచనా వేసిన షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్, 2100లో చైనా జనాభా 587 మిలియన్లకు పడిపోతుందని అంచనా వేసింది. ఇది ప్రస్తుతం ఉన్న దానిలో సగం కంటే తక్కువ.

దేశ, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం:

చైనాలో వేగంగా జనాభా క్షిణించడం ఆదేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చైనాలో పని వయస్సు జనాభా 2014లో గరిష్ట స్థాయికి చేరుకుంది. 2100 నాటికి ఆ గరిష్టంలో మూడింట ఒక వంతు కంటే తక్కువగా కుదించబడుతుందని అంచనా వేశారు. 2100 నాటికి చైనాలో వృద్ధుల జనాభా పెరిగి..పని వయస్సు జనాభాను దాటితుందని ఒక అంచనా. దీనర్థం, ప్రస్తుతం దేశంలో ప్రతి 20 మంది వృద్ధులను పోషించడానికి 100 మంది పని చేసే వయస్సు గల వ్యక్తులు అందుబాటులో ఉండగా, 2100 నాటికి, 120 మంది వృద్ధులను పోషించడానికి 100 మంది పని వయస్సు గల వ్యక్తులు పనిచేయాల్సి ఉంటుంది. అయితే జనాభా వృద్ధి రేటు క్షిణిస్తున్న తరుణంలో 2080నాటికే చైనాలో పనిచేసే యువత తగ్గిపోతారని..తద్వారా చైనా ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుందన్నది విశ్లేషకుల మాట.