Indian railway: దిగొచ్చిన రైల్వేశాఖ.. రూ.35కోసం ఓ వ్యక్తి ఐదేళ్లుగా పోరాటం.. 3లక్షల మందికి లబ్ధి..

మీరెప్పుడైనా రైల్వే టికెట్, బస్సు టికెట్ తీసుకున్న తరువాత తిరిగి చిల్లర ఇవ్వకపోతే నిలదీసి అడిగారా?.. అడిగే ఉంటారు లేండి.. రూ. 50 పైన ఇవ్వాల్సి ఉంటే అడిగి ఉంటారు. అదే ముప్పైనలబై రూపాయలు అయితే.. వాళ్లు చిల్లర ఇచ్చే సమయం వరకు వేచి ఉండలేక పోతేపోనీలే అని తిరిగి వచ్చేస్తాం.. అంతేగా... కానీ ఆ వ్యక్తి అలాకాదు.. రైల్వే శాఖ నుంచి రావాల్సిన రూ.35 కోసం ఐదేళ్లుగా పోరాటం చేశాడు.

Indian railway: దిగొచ్చిన రైల్వేశాఖ.. రూ.35కోసం ఓ వ్యక్తి ఐదేళ్లుగా పోరాటం.. 3లక్షల మందికి లబ్ధి..

India Railway

Indian railway: మీరెప్పుడైనా రైల్వే టికెట్, బస్సు టికెట్ తీసుకున్న తరువాత తిరిగి చిల్లర ఇవ్వకపోతే నిలదీసి అడిగారా?.. అడిగే ఉంటారు లేండి.. రూ. 50 పైన ఇవ్వాల్సి ఉంటే అడిగి ఉంటారు. అదే ముప్పైనలబై రూపాయలు అయితే.. వాళ్లు చిల్లర ఇచ్చే సమయం వరకు వేచి ఉండలేక పోతేపోనీలే అని తిరిగి వచ్చేస్తాం.. అంతేగా… కానీ ఆ వ్యక్తి అలాకాదు.. రైల్వే శాఖ నుంచి రావాల్సిన రూ.35 కోసం ఐదేళ్లుగా పోరాటం చేశాడు. చివరకు రైల్వే శాఖ దిగొచ్చేలా చేశాడు. ఆ వ్యక్తి ఐదేళ్ల పోరాటం వల్ల అతనికి రావాల్సిన రూ.35లతో పాటు మరో సుమారు 3లక్షల మందికి సర్వీస్ చార్జి సొమ్మును రైల్వే శాఖ తిరిగిచ్చేలా చేశాడు. ఇంతకీ రూ.35కోసం ఐదేళ్లు పోరాటం చేసిన వ్యక్తి ఎవరు? ఎందుకు అంత పట్టుదలతో పోరాటం చేశాడంటే..

Upside Down Railway : ట్రాక్ కింద వేలాడుతూ..త‌ల‌కిందులుగా ప్ర‌యాణించే రైళ్లు..! చూడాలన్నా..ప్రయాణించాలన్నా అక్కడికి వెళ్లాల్సిందే..

రాజస్తాన్ కు చెందిన సుజీత్ స్వామి అనే ఇంజనీర్ రైల్వే నుంచి తనకు రావాల్సిన 35 రూపాయలను ఐదేళ్ల పాటు పోరాడి మరీ సాధించుకున్నాడు. 2017 జులై 2వ తేదీన కోటా నుంచి ఢిల్లీ వెళ్లేందుకు 2017 ఏప్రిల్ నెలలో టికెట్ బుక్ చేసుకున్నాడు. తర్వాత దానిని రద్దు చేసుకున్నాడు. జూలై1 నుంచి జీఎస్టీ అమల్లోకి రావడంతో క్యాన్సలేషన్ లో భాగంగా 35 రూపాయల సర్వీస్ చార్జినికూడా టికెట్ డబ్బుల్లో నుంచి రైల్వేశాఖ కట్ చేసుకుంది. అయితే తనకు రావాల్సిన రూ.35 ఎందుకు కట్ చేసుకున్నారంటూ రైల్వే అధికారులను సుజీత్ స్వామి ప్రశ్నించారు. జీఎస్టీ అమల్లోకి రావటంతో కట్ చేసుకున్నామని బదులిచ్చారు. నేను టికెట్ బుక్ చేసుకుంది ఏప్రిల్ నెలలో జీఎస్టీ అమల్లోకి వచ్చింది జులై 1 నుంచి.. అలా ఎట్లా కట్ చేసుకుంటారు అంటూ నిలదీశాడు. రైల్వే అధికారులు సరియైన సమాధానం ఇవ్వకపోవటంతో సుజీత్ స్వామి న్యాయ పోరాటానికి దిగాడు. అప్పటి నుంచి ఆర్టీఐ కింద ఏకంగా 50 దరఖాస్తులు పెట్టడంతో పాటు నాలుగు ప్రభుత్వ శాఖలకు లేఖలపై లేఖలు రాశాడు. వరుస ట్వీట్లు చేశాడు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను, జీఎస్టీ కౌన్సిల్ ను టాగ్ చేశాడు.

South East Central Railway: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో 1044 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ

2019లో సుజీత్ స్వామి పోరాటానికి దిగొచ్చిన రైల్వే శాఖ తన సొమ్మును రీఫండ్ చేస్తామని తెలిపింది. అయితే సుజీత్ స్వామికి రూ.35 రావాల్సి ఉంటే కేవలం రూ. 33 రీఫండ్ చేసింది. దీంతో మళ్లీ రైల్వే అధికారుల తీరుపై పోరాటానికి దిగాడు. నాకు రావాల్సిన రూ. 2 ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టాడు. అప్పటి నుంచి 2రూపాయలకోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఎట్టకేలకు దిగొచ్చిన రైల్వే శాఖ తనకు చెల్లించాల్సిన 2 రూపాయలను రీఫండ్ చేసింది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే సుజీత్ స్వామి ఐదేళ్ల పోరాటం వల్ల 2017 జూన్ 2కు ముందు టికెట్లు రద్దు చేసుకున్న సుమారు 2.98 లక్షల మందికి రూ.35 సర్వీస్ చార్జి రీఫ్ండ్ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.