ఏమీ వైప‌రీత్యం : కశ్మీర్‌లో మంచు తుఫాన్ – ముగ్గురు మృతి

జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది. మంచు తుఫాన్ తీవ్రత ధాటికి తట్టుకోలేక ముగ్గురు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు.

  • Published By: sreehari ,Published On : March 12, 2019 / 07:35 AM IST
ఏమీ వైప‌రీత్యం : కశ్మీర్‌లో మంచు తుఫాన్ – ముగ్గురు మృతి

జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది. మంచు తుఫాన్ తీవ్రత ధాటికి తట్టుకోలేక ముగ్గురు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు.

జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది. మంచు తుఫాన్ తీవ్రత ధాటికి తట్టుకోలేక ముగ్గురు మృతిచెందారు. కుప్వారా నుంచి  కర్నహ్ ప్రాంతానికి కొంతమంది గ్రూపుగా కాలినడకన వెళ్తుండగా మంచు తుఫాన్ లో చిక్కుకున్నారు. ఉత్తర కశ్మీర్ లోని సాధ్నా టాప్ మౌంటేయన్ ఏరియాకు సమీపంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు.

మంచు తుఫాన్ లో చిక్కుకున్న ముగ్గురు అదృశ్యమయ్యారని, మిగతా వారంతా అతి కష్టం మీద సాధ్నా పర్వత పై భాగానికి చేరుకున్నట్టు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అర్మీ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

అదృశ్యమైన ముగ్గురి మృతదేహాలను గుర్తించినట్టు అధికారి ఒకరు చెప్పారు. మృతిచెందిన ముగ్గురిలో తాహీర్ ఖాజా, ఖాలీక్ షేక్, ఫరీద్ అహ్మద్ ఉండగా.. వీరంతా కర్నహ్ ప్రాంతానికి చెందినవారికిగా అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంచు పడుతుండటంతో కుప్వారా నుంచి కర్నహ్ ప్రాంతానికి వెళ్లే రోడ్డు మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు.