Nitin Gadkari: ప్రతి ఒక్కరూ 3పాయింట్ల సీట్ బెల్ట్ ధరించాల్సిందే

ఇకపై కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ మూడు పాయింట్ల సీట్ బెల్ట్ తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. 'ఆటోమొబైల్ సేఫ్టీ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా'...

Nitin Gadkari: ప్రతి ఒక్కరూ 3పాయింట్ల సీట్ బెల్ట్ ధరించాల్సిందే

Seat Belt

Updated On : February 10, 2022 / 8:10 PM IST

Nitin Gadkari: ఇకపై కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ మూడు పాయింట్ల సీట్ బెల్ట్ తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ‘ఆటోమొబైల్ సేఫ్టీ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా’ సదస్సులో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ముందు సీట్లలో కూర్చొనే వారికి మూడు పాయింట్ల సీట్ బెల్ట్ ప్రాముఖ్యత గురించి చెప్తూ ఇకపై తప్పనిసరి చేస్తున్నట్లు త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ వస్తుందని అన్నారు.

దేశీయంగా తయారవుతున్న ఆటోమొబైల్స్ సేఫ్టీ ఫీచర్స్ ఆధారంగా ఇండిపెండెంట్ ఏజెన్సీగా ఎదగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు దారులు సేఫ్టీ రేటింగ్ ను బట్టే ఆసక్తి కనబరుస్తారు. ఇవే కాకుండా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడ్వాన్స్‌డ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, లానె డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లపైనా ఫోకస్ పెడుతున్నామని అననారు.

ఫోర్ వీలర్స్, టూ వీలర్స్ ల సేఫ్టీ ఫీచర్లపై ఏదో ఒక మార్పు కచ్చితంగా ఉంటుందన్నారు.

Read Also: కరోనా వేవ్‌ను సక్సెస్ వేవ్‌గా మార్చుకున్న మాస్ రాజా!

ఏటా రోడ్ యాక్సిడెంట్ల కారణంగా 1.5లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే వాహనాల తయారీ విషయంలో ఔన్నత్యాన్ని ప్రదర్శించాలి. వాహనాలు ఎక్కేవారిని బెస్ట్ గా ప్రొటెక్ట్ చేయగలగాలి. హైఎండ్ ఆటోమొబైల్స్ లో ఉన్న సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్ చేయాలనుకుంటున్నాం. దేశంలో అమ్ముడవుతున్న ప్రతి సింగిల్ కారులో ఇవి ఉండాలనేదే ఈ ప్రయత్నమని మంత్రి వెల్లడించారు.