Delhi Tragedy : ఢిల్లీలో దారుణం.. ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో ముగ్గురు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూఆపరేషన్

డీసీపీ హర్షవర్దన్ మాట్లాడుతూ.. శనివారం రాత్రి 7.15గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో కోచింగ్ సెంటర్లో 30మంది విద్యార్థులు ఉన్నారని

Delhi Tragedy : ఢిల్లీలో దారుణం.. ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో ముగ్గురు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూఆపరేషన్

Delhi coaching centre flooded

Delhi Old Rajender Nagar Incident : ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాజేంద్ర నగర్ లోని రావు ఐఏఎస్ అకాడమీ భవనం బేస్‌మెంట్ మొత్తం భారీ వరద నీరు చేరి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఉన్నట్లుండి భారీ స్థాయిలో వరదనీరు ఐఏఎస్ స్టడీ సర్కిల్ భవనం బేస్‌మెంట్ లోకి చేరింది. వరద నీటిలో విద్యార్థులు చిక్కుకున్నట్లు సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది హుటాహుటీన ఘటన స్థలంకు చేరుకొని వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఐదు ఫైరింజన్లతో నీటిని బయటకు పంపారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ముగ్గురు మృతి చెందారు. మరికొంత మంది వరద నీటిలో చిక్కుకున్నట్లు తెలుస్తుండగా.. వారికోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.

Also Read : Road Accident : కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు మృతి

డీసీపీ హర్షవర్దన్ మాట్లాడుతూ.. శనివారం రాత్రి 7.15గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో కోచింగ్ సెంటర్లో 30మంది విద్యార్థులు ఉన్నారని, భారీగా వరద నీరు బేస్ మెంట్ లోకి ఎలా చేరిందనే విషయం విచారణలో తేలాల్సి ఉందని చెప్పారు. ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించడం జరిగిందని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఆప్ నాయకురాలు అతిషి సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై మెజిస్ట్రీరియల్ విచారణకు ఆదేశించామని, ఈఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ సంఘటనా స్థలంలో ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

Also Read : గంజాయితో యువతి జీవితాన్ని నాశనం చేసి.. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి.. ఖతర్నాక్ కిలాడీలు

ఘటన స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎంసీడీ, కోచింగ్ ఇన్ స్టిట్యూట్ కి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన చేపట్టారు. ఘటనకు ఢిల్లీ ప్రభుత్వం నుంచి బాధ్యతల వహించాలని డిమాండ్ చేస్తున్నారు. బాధ్యత తీసుకునేవారు ఎవరూ లేరు. ప్రభుత్వం నుంచి ఎవరైనా వచ్చి ఘటనపై బాధ్యత తీసుకోవాలి. ఏసీ గదుల్లో ఉండి ట్వీట్ చేసి, లేఖ రాస్తే సరిపోదంటూ పలువురు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.