Road Accident : కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు మృతి

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి మండలం జగ్గంపేట సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Road Accident : కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు మృతి

Road Accident

Updated On : July 28, 2024 / 7:43 AM IST

Road Accident in Kakinada District : కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి మండలం జగ్గంపేట సమీపంలోని మురారి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం బైక్ ను ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో బైక్ పై నలుగురు ప్రయాణిస్తున్నారు. బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Also Read : గంజాయితో యువతి జీవితాన్ని నాశనం చేసి.. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి.. ఖతర్నాక్ కిలాడీలు

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల్లో మహిళకూడా ఉన్నట్లు తెలిసింది. మృతులంతా భీమవరం వాసులుగా పోలీసులు గుర్తించారు. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగింది.. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టిన వాహనం ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.