ఊరట : ఛానళ్ల సెలక్షన్ మరో రెండు నెలలు

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) కొత్త టారిఫ్ విధానం కింద గతంలో జనవరి 31వరకు ఛానళ్ల జాబితాను ఎంచుకునేందుకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగించింది. మార్చి 31,2019వరకు యూజర్లు తమకు కావాల్సిన ఛానళ్లను ఎంచుకోవచ్చని తెలిపింది. ఛానళ్లను ఎంచుకోవడంలో కొందరు వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని, స్థానిక కేబుల్ ఆపరేటర్లు ఛానళ్ల ఎంపిక విషయంలో యూజర్లకు అవగాహన కల్పించకపోవడంతోనే ఇటువంటి ఇబ్బంది తలెత్తుతుందని ట్రాయ్ తెలిపింది.
బెస్ట్ ఫిట్ ప్లాన్ కింద యూజర్లు తమకు కావాల్సిన ఛానళ్లను ఎంపిక చేసుకోవడంలో ఎక్కువమంది ఫెయిల్ అవుతున్నారని, ఇందుకోసమే గడువు పొడిగించినట్లు తెలిపింది. ఛానళ్లు ఎంపిక చేసుకునేందుకు పాత ఫ్లాన్ కొనసాగుతోందని తెలిపింది. ట్రాయ్ రిపోర్ట్ ప్రకారం దేశవ్యాప్తంగా 10కోట్ల కేబుల్ సర్వీసులు, 6కోట్ల 70లక్షల డీటీహెచ్ సర్వీసులు ఉన్నాయి.
Also Read: ఎక్కువ వసూల్ చేశారంటే : టీవీ ఆపరేటర్లకు ట్రాయ్ వార్నింగ్
Also Read: పబ్‌జీకు మించిన గేమ్ వచ్చేసింది..
Also Read: ఐఫోన్‌లో కొత్త ఫీచర్.. మీ కారుకు ఫుల్ సెక్యూరిటీ
Also Read: బ్లూవేల్‌కు మించి: ‘టిక్ టాక్’ App బ్యాన్ చేయాల్సిందే