ఆ ఒక్కడి కోసం రైలు కిలోమీటర్ వెనక్కి వెళ్లింది
రాజేంద్ర ఒక్కసారిగా లేచి డోర్ వైపుకు పరిగెత్తాడు. అది చూసి పట్టుకునేందుకు ఇంకో సోదరుడైన వినోద్ అతని వెంటే వెళ్లాడు. కానీ, సాధ్యపడలేదు. వేగంగా రాజేంద్ర ట్రైన్ నుంచి దూకేశాడు. పట్టుకునే ప్రయత్నంలో వినోద్ కూడా అతని వెంటే కిందపడిపోయాడు' అని చెప్పాడు.

రాజేంద్ర ఒక్కసారిగా లేచి డోర్ వైపుకు పరిగెత్తాడు. అది చూసి పట్టుకునేందుకు ఇంకో సోదరుడైన వినోద్ అతని వెంటే వెళ్లాడు. కానీ, సాధ్యపడలేదు. వేగంగా రాజేంద్ర ట్రైన్ నుంచి దూకేశాడు. పట్టుకునే ప్రయత్నంలో వినోద్ కూడా అతని వెంటే కిందపడిపోయాడు’ అని చెప్పాడు.
రైలు లేట్‌గా వస్తుందే కానీ, ఒకడి కోసం ఆగదు.. ఒక్కడే ఉన్నాడని ఆగదు.. సిస్టమ్ ప్రకారం వెళ్లిపోతుందంతే. కానీ, ఇక్కడ రైలు సిబ్బంది మానవత్వానికి విలువనిచ్చారు. ఒక్కరి కోసం ట్రైన్ వెనక్కితిప్పారు. రాజస్థాన్‌లోని ఆత్రూ-సల్పూరా రైల్వే ట్రాక్‌పై ఈ సంఘటన చోటు చేసుకుంది. రైలు నుంచి కిందపడి గాయపడిన వ్యకిని హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు ఆ రైలును నడిపేవ్యక్తి రివర్స్ తీసుకోవాల్సి వచ్చింది.
శుక్రవారం సాయంత్రం 4గంటలకు రాజేంద్ర వర్మ రైలు నుంచి దూకేశాడు. అతణ్ని కాపాడేందుకు సోదరుడైన వినోద్ ట్రైన్ నుంచి దూకేశాడు. వారితో పాటు రైలులో ప్రయాణించిన సురేశ్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ‘మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో రాజేంద్ర వర్మ నేను కలిసి పని చేస్తున్నాం. ఐదు రోజులుగా రాజేంద్ర మానసిక స్థితి సరిగా ఉండటం లేదు. ఏప్రిల్ 24వ తేదీ రాత్రి మధ్యప్రదేశ్‌లోని కాట్నా మీదుగా సికార్ జిల్లాకు వెళ్లాలనుకున్నాడు. అటు వెళ్లడానికి బదులు జైపూర్ వెళ్లే ట్రైన్‌లో మాతో పాటు బయల్దేరాడు.
ఏప్రిల్ 25వ తేదీ రాత్రి 3గంటల సమయంలో అశోక్ నగర్ రైల్వే స్టేషన్ దాటాక వేగంగా వెళుతున్న రైలులో నుంచి రాజేంద్ర దూకేశాడు. వెంటనే చైన్ లాగి అతణ్ని కాపాడుకోగలిగాం. ఆ తర్వాత జరిమానా కట్టి అక్కడి నుంచి వేరే రైలు ఎక్కి జైపూర్ బయల్దేరాం. తర్వాతి రోజు సాయంత్రం 4గంటలకు రైలు బారాన్ జిల్లా సల్పూరా ప్రాంతం దాటింది. అప్పర్ బెర్త్‌లో నిద్రపోతున్న రాజేంద్ర ఒక్కసారిగా లేచి డోర్ వైపుకు పరిగెత్తాడు. అది చూసి పట్టుకునేందుకు ఇంకో సోదరుడైన వినోద్ అతని వెంటే వెళ్లాడు. కానీ, సాధ్యపడలేదు. వేగంగా రాజేంద్ర ట్రైన్ నుంచి దూకేశాడు. పట్టుకునే ప్రయత్నంలో వినోద్ కూడా అతని వెంటే కిందపడిపోయాడు’ అని చెప్పాడు.
కోటా ప్రాంతానికి సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అయిన విజయ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. రాజేంద్ర దూకిన వెంటనే ఎవరో రైలు గొలుసు లాగారు. అప్పటికే రైలు కొద్ది కిలోమీటర్ల దూరం వెళ్లింది. రాజేంద్ర బంధువులు అంబులెన్స్ కోసం ప్రయత్నించారు. ఆ ప్రదేశంలో ఎటువంటి అంబులెన్స్ సదుపాయాలు అందవనే సంగతి మాకు తెలుసు. అందుకే ట్రైన్ లోకో పైలట్(రైలు డ్రైవర్) కిలో మీటర్ వరకూ రైలును రివర్స్ పోనిచ్చాడు. గాయానికి గురైన ప్రయాణికుడ్ని, రైలులో నుంచి కిందకి దూకేసిన వ్యక్తిని తీసుకుని ట్రీట్మెంట్ కోసం హస్పిటల్‌లో చేర్పించాం. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉంది’ అని అధికారి తెలిపారు.