ఉద్యోగులను బదిలీ చేయండి: రాష్ట్రాలకు ఈసీ లేఖ

  • Published By: chvmurthy ,Published On : January 17, 2019 / 03:56 PM IST
ఉద్యోగులను బదిలీ చేయండి: రాష్ట్రాలకు ఈసీ లేఖ

Updated On : January 17, 2019 / 3:56 PM IST

ఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో కేంద్ర ఎన్నికలసంఘం రాష్ట్రాలకు లేఖ రాసింది. ఒకే చోట మూడేళ్ళనుంచి పని చేస్తున్నఉన్నతాధికారులను బదిలీ చేయాలని ఆదేశిస్తూ లేఖ సారాంశం. గత సార్వత్రిక ఎన్నికల్లో పనిచేసిన అధికారులు ఇంకా అదే ప్లేస్ లో పనిచేస్తూ ఉంటే వారిని వేరేచోటకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఐఏఎస్,ఐపీఎస్,కలెక్టర్,డిప్యూటీ కలెక్టర్,జాయిట్ కలెక్టర్, ఆర్ వో,తహసిల్దార్, బీడీవోలతో పాటు ఇతర ఉన్నతస్ధాయి అధికారులను బదిలీ చేయాలని పేర్కోంటూ ఐజీ నుంచి ఎస్ఐ స్ధాయి వరకు అందరూ బదిలీకి అర్హులంటూ  తెలిపింది.