తొలిసారి : కుంభమేళాలో హిజ్రాల గంగాస్నానం

  • Published By: veegamteam ,Published On : January 17, 2019 / 04:24 AM IST
తొలిసారి : కుంభమేళాలో హిజ్రాల గంగాస్నానం

అత్యంత అద్భుతంగా సాగుతోన్న ప్రయాగ రాజ్ కుంభమేళా
2వ రోజు వేలాదిగా స్నానాలు ఆచరించిన సాధువులు
తొలిసారి అఖాడా పేరుతో టెంట్లు ఏర్పాటు చేసిన హిజ్రాలు
సాధువుల్లాగే స్నానాలు అచరించిన హిజ్రాలు

ప్రయాగ రాజ్ : కుంభమేళా అత్యంత అద్భుతంగా సాగుతోంది.. రెండో రోజు కూడా వేల సంఖ్యలో సాధువులు స్నానాలు ఆచరించారు. దశాబ్దాల పోరాటం ఫలితంగా సమాజం చిన్నచూపు చూసే హిజ్రాలు (ట్రాన్సజెండర్స్ ) మొట్టమొదటిసారిగా కుంభమేళాలో పాల్గొన్నారు. ఇతరులతో సమానంగా హిజ్రాలను కూడా కుంభమేళాలో పాల్గొనడానికి అనుమతించాలని , వారి హక్కులను కాపాడాలని లక్ష్మీనారాయణ త్రిపాఠి అనే హిజ్రా దశాబ్దాల తరబడి పోరాటం చేసిన ఫలితంగా ప్రస్తుత కుంభమేళాలో వారు కూడా పాల్గొని చరిత్ర సృష్టించారు. ఇదో చారిత్రాత్మక పరిణామం. కుంభమేళాకు తరలివచ్చిన లక్షలాదిమంది హిజ్రాలు గంగా, యమునా నదుల్లో పవిత్ర స్నానాలు చేశారు. ప్రపంచంలోని అతి పెద్ద ఉత్సవాల్లో ఒకటైన కుంభమేళాలో మొదటిసారిగా ఇరవై లక్షల మంది హిజ్రాలను అనుమతించినట్లు సమాచారం. కాషాయం, ఎరుపు రంగు చీరల్లో హిజ్రాలు తరలివచ్చారు.ఐతే.. తొలిసారి హిజ్రాలు ఇక్కడ అఖాడా పేరుతో టెంట్లు వేశారు. సాధువుల్లగే వీరు కూడా స్నానం ఆచారించారు.