అనంత పద్మనాభ స్వామి ఆలయం..ఆరో గది తలుపులు తెరుస్తారా

కేరళ రాష్ట్రంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయ వివాదానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. గత 9 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వివాదంపై 2020, జులై 13వ తేదీ సోమవారం తీర్పునిచ్చింది. ఆలయ మేనేజ్ మెంట్ వివాదంలో Travancore రాజ కుటుంబానికి అనుకూలంగా సుప్రీం తీర్పును ప్రకటించింది.
రాజకుటుంబానికి ఆలయ పాలనపై ఉన్న హక్కులను సమర్థించింది. ఈ క్రమంలోనే…ఆలయానికి సంబంధించి పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు త్రివేండ్రం జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. కొత్త కమిటీ ఏర్పాటు అయ్యే వరకు ప్రస్తుత కమిటీ కొనసాగుతుందని సుప్రీం తెలిపింది.
గుడిలోని రహస్య తలుపులు తెరవడంతో…లక్షల కోట్ల విలువైన నిధులు లభ్యం కావడం సంచలమైంది. 2011లో ఒక్కసారిగ ఈ ఆలయం వార్తల్లోకెక్కింది. భారతదేశంలోనే అత్యంత విలువైన ఆలయంగా గుర్తింపు పొందింది. ఐదు తలుపులు (నేలమాళిగలు) తెరిచిన వారు..ఆరో గది తలుపు మాత్రం తీయలేదు.
తలుపులు తీయడం వల్ల నష్టం జరుగుతోందని..ఆరో నేలమాళిగ కూడా తీస్తే..ప్రళయం వస్తుందని కొందరు హెచ్చరించారు. గది తలుపులు తెరవాల్సిందేనని ఎలాంటి నష్టం జరగదని మరికొంతమంది వెల్లడిస్తున్నారు. తలుపులు తెరవాల వద్దా అనేది ఎవరూ నిర్ణయం తీసుకోలేదు.
1991 లో Travancore చివరి పాలకుడు చనిపోయాడు. రాజ కుటుంబ హక్కులు నిలిచిపోయాయని కేరళ హైకోర్టు 2011 లో తీర్పునిచ్చింది. ఆరో తలుపులు కూడా తెరవాలని చెప్పింది. ఆరో నేలమాళిగలు తెరవడం ట్రావెన్ కోర్ వంశీయులకు ఇష్టం లేదు.
ఆలయం సంపదలు, నిర్వహణ బాధ్యతలను ట్రావెన్ కోర్ రాజవంశం నుంచి స్వాధీనం చేసుకోవాలని Kerala High Court తీర్పు వెలువరించింది. 2011 జనవరి, 31వ తేదీన ఈ తీర్పు చెప్పింది. దీనిపై ట్రావెన్ కోర్ రాజవంశీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ…సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీనిపై Supreme Court విచారణ జరిపింది. గత సంవత్సరం ఏప్రిల్ లో తీర్పును రిజర్వ్ లో ఉంచింది. 9 సంవత్సరాల తర్వాత సుప్రీం తీర్పును వెలువరించింది. చివరి పాలకుడి మరణం వల్ల కుటుంబ హక్కులు రద్దు చేయబడవని తెలిపింది.
ఆలయ నిర్వహణ బాధ్యతలు Travancore రాజకుటుంబానికే చెందుతాయని తెలిపింది. మరి ఆరో గది తలుపులు తెరవడంపై ట్రావెన్ కోర్ ఫ్యామిలీ ఎలాంటి నిర్ణయం తీసుకొనందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.