Karnataka : కర్నాటక డ్రగ్స్ కేసులో మలుపులు, టాలీవుడ్ హీరోకు నోటీసులు! ఎవరా హీరో

కర్నాటక డ్రగ్స్‌ కేసు.. రోజుకో మలుపు తిరుగుతోంది. కేసులో సంచలన విషయాలు బయట పడుతున్నాయి.

Karnataka : కర్నాటక డ్రగ్స్ కేసులో మలుపులు, టాలీవుడ్ హీరోకు నోటీసులు! ఎవరా హీరో

Karnataka

Updated On : April 5, 2021 / 1:32 PM IST

Karnataka drug case : కర్నాటక డ్రగ్స్‌ కేసు.. రోజుకో మలుపు తిరుగుతోంది. కేసులో సంచలన విషయాలు బయట పడుతున్నాయి. కన్నడ సినీ నిర్మాత శంకరగౌడ్ పుట్టిన రోజు వేడుకల్లో రాజకీయ సినీ ప్రముఖులు పార్టీలో హాజరైనట్లు నిర్ధారించారు పోలీసులు. పార్టీకి హాజరైన వారిలో తెలంగాణ ఎమ్మెల్యేతో పాటు కొంతమంది వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. పార్టీకి హాజరైనవారిలో కొంతమంది డ్రగ్స్‌ సేవించినట్లు పోలీసు విచారణలో తేలింది.

ఈ కేసులో కీలక సూత్రధారి మస్తాన్‌చంద్ర నుండి పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. అతను ఇచ్చిన సమాచారంతోనే హైదరాబాద్‌ వ్యాపారి సందీప్‌రెడ్డి, కలహర్‌రెడ్డి, ఓ ఎమ్మెల్యే ప్రేమేయం బయటపడింది. దీంతో ఇప్పటికే ఈ ఇద్దరు వ్యాపార వేత్తలకు నోటీసులు కూడా జారీ చేశారు. గోవిందపుర పోలీసులు ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులో చెప్పినప్పటికీ… రాక పోవడంతో బెంగళూర్ పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధం అయ్యారు.

డ్రగ్స్ కేసులో సూత్రదారి మస్తాన్‌చంద్రతో సంబంధాలు కలిగిఉన్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఇక వ్యాపార వేత్తలతో పాటు ఓ ఎమ్మెల్యే, టాలీవుడ్ హీరోకి కూడా నోటీసులు జారీ చేసి విచారణ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో రెండుసార్లు పట్టుబడ్డ నైజీరియా దేశస్థుల నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌ నుంచి సరఫరా అయ్యాయి. ఈ విషయాన్ని బెంగళూరు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో కూడా స్పష్టం చేశారు. విదేశీ నౌకల ద్వారా వీటిని సరఫరాచేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read More : Telangana : నెలకు 250 యూనిట్ల విద్యుత్ ఫ్రీ..వారికి మాత్రమే