Delhi Assembly Election 2025: ఎన్నికల ఫలితాలపై మీమ్స్‌.. పగలబడి నవ్వుకుంటున్న నెటిజన్లు

బీజేపీ మెజార్టీ స్థానాల్లో ముందంజలో, ఆప్ రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.

Delhi Assembly Election 2025: ఎన్నికల ఫలితాలపై మీమ్స్‌.. పగలబడి నవ్వుకుంటున్న నెటిజన్లు

Updated On : February 8, 2025 / 11:11 AM IST

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్‌ వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ మెజార్టీ స్థానాల్లో ముందంజలో, ఆప్ రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్‌ కేవలం ఒకే ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉంది.

ఢిల్లీ ఎన్నికల ఫలితాల వేళ ఇవాళ అందరూ రాజకీయ విశ్లేషకులు అయిపోయారని కొన్ని మీమ్స్ వచ్చాయి. బీజేపీ, ఆప్ ముందుకు పరిగెడుతుంటే కాంగ్రెస్‌ మాత్రం వెనక్కి పరిగెడుతోందని కొందరు మీమ్స్‌ సృష్టించారు.

కాంగ్రెస్‌ పార్టీ నీటిలో మునిగిపోగా, ఆప్‌ నీటిలో సగం మునిగిపోయిందని కొందరు మీమ్స్‌ క్రియేటర్ చేశారు. బీజేపీని ప్రజలు ఆకాశానికెత్తేశారని, ఇక దించడం కష్టమని మరికొందరు పోస్టులు చేశారు. కేజ్రీవాల్ ఇప్పుడు ఏం చేస్తుంటారంటూ కొందరు మీమ్స్‌ సృష్టించారు.