Congress : కాంగ్రెస్‌కి షాక్.. రాజీనామా చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి
మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మేఘాలయకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు.

Congress
Congress : మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మేఘాలయకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వీరిలో ఒకరు మేఘాలయా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేమ్స్ లింగ్డో కాగా.. మరొకరు మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మానస్ దాస్ గుప్తా. వీరి రాజీనామా లేఖను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు పంపినట్లుగా జేమ్స్ వెల్లడించారు.
చదవండి : T.Congress : అందరం పీసీసీ ప్రెసిడెంట్లమే..నా రక్తంలో కాంగ్రెస్ ఉంది – కోమటిరెడ్డి
ఇక ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత 33 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు చేపట్టానని, తన తండ్రి మేఘాలయాలో పార్టీని పటిష్టపరిచినా కాంగ్రెస్ నాయకత్వం తనను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందే మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీ పతనం ఆరంభమైందని అన్నారు. ఇక ఇదిలా ఉంటే గతవారం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో మేఘాలయా మాజీ సీఎం కూడా ఉండటం గమనార్హం.
చదవండి : Congress paddy fight: కాంగ్రెస్ వరి దీక్ష @ రెండో రోజు