Two earthquakes: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మంగళవారం ఉదయం 6.27 గంటల సమయంలో భూకంపం సంభవించింది. మొదట వచ్చిన భూకంపం రిక్టర్‌ స్కేల్‌పై 4.3 తీవ్రతతో నమోదవగా.. తర్వాత మళ్లీ 4.6 తీవ్రతతో ఉదయం 7.21 గంటల సమయంలో మరోసారి భూకంపం సంభవించింది.

Two earthquakes: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం

Earth Quake

Updated On : August 3, 2021 / 12:59 PM IST

Two earthquakes strike Andaman and Nicobar Islands: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మంగళవారం ఉదయం 6.27 గంటల సమయంలో భూకంపం సంభవించింది. మొదట వచ్చిన భూకంపం రిక్టర్‌ స్కేల్‌పై 4.3 తీవ్రతతో నమోదవగా.. తర్వాత మళ్లీ 4.6 తీవ్రతతో ఉదయం 7.21 గంటల సమయంలో మరోసారి భూకంపం సంభవించింది. ఈ మేరకు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ ప్రకటన చేసింది. అయితే, భూకంపంతో ఎటువంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది.

భూకంపం ఎందుకు వస్తుంది..?
భూమి ప్రధానంగా నాలుగు పొరలతో రూపొందించబడింది, లోపలి కోర్, బాహ్య కోర్, మాంటిల్ మరియు క్రస్ట్. క్రస్ట్ మరియు ఎగువ మాంటిల్‌ను లిథోస్పియర్ అంటారు. ఈ 50కి.మీ. మందపాటి పొరను విభాగాలుగా విభజించారు. వీటిని టెక్టోనిక్ ప్లేట్లుగా చెబుతారు. ఈ టెక్టోనిక్ ప్లేట్లు వాటి ప్రదేశం నుంచి కదులుతూనే ఉంటాయి. కానీ అవి ఎక్కువ కదిలినప్పుడు, భూకంపం సంభవిస్తుంది. ఈ ప్లేట్లు అడ్డంగా మరియు నిలువుగా కదులుతాయి.

అయితే, భూమి కదలికలకు సంబంధించి శాస్త్రవేత్తలు చెబుతున్న వివరాల ప్రకారం.. భూకంపం తీవ్రత 5కంటే తక్కువ ఉంటే మాత్రం ఎటువంటి ప్రమాదం ఉండదు. ప్రాణనష్టం జరగదు.