మనుషులేనా : 3 ఏళ్ల బాలికపై ఇద్దరు గ్యాంగ్ రేప్..చెరువులో డెడ్ బాడీ

కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తున్న వేళ కామాంధులు రెచ్చిపోతున్నారు. అభం..శుభం తెలియని పసికందులపై దారుణాలకు తెగబడుతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని Chhindwaraలో మూడేళ్ల బాలికపై ఇద్దరు యువకులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడి అనంతరం చంపేశారు.
డెడ్ బాడీని ఓ సరస్సులో విసిరేశారు. ఈ ఘటనపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. వెంటనే ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.
2020, జులై 17వ తేదీన ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ కు పాల్పడ్డారని అడిషనల్ సూపరిటెండెంట్ పోలీస్ శశాంక్ గార్గ్ వెల్లడించారు. మూడు రోజుల అనంతరం ఓ సరస్సులో డెడ్ బాడీ కనిపించిందన్నారు.
విచారణ అనంతరం రితేశ్ సింగ్ (22), ధన్ పాల్ (21) ను అరెస్టు చేయడం జరిగిందని, నిందితుల్లో ఒకరు రూ. 10 ఇచ్చి చిన్నారిని ఎత్తుకెళ్లారన్నారు. అనంతరం ఆ ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారన్నారు.
చిన్నారిని చంపేసి…డెడ్ బాడీని ప్లాస్టిక్ కవర్ లో పెట్టి..చోటా మహదేవ్ రిజర్వాయర్ లోకి విసిరేశారన్నారు. ఈ ఘటనను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఖండించారు. ఘటనపై వేగంగా, సమగ్రంగా దర్యాప్తు జరిపించాలని డీజీపీకి ఆదేశించారు.