Union Cabinet : ఎంపీ లాడ్స్ నిధుల పునరుద్ధరణ, కొనసాగింపుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎంపీ లాడ్స్ నిధుల పునరుద్ధరణ, కొనసాగింపుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2021-22 ఏడాదికి మిగిలిన భాగం కోసం ఎంపీ లాడ్స్ పునరుద్ధరించారు.

Union Cabinet

restoration of MP Lads funds : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీ లాడ్స్ నిధుల పునరుద్ధరణ, కొనసాగింపుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నిలిపేసిన ఎంపీ-లాడ్స్ నిధులను పునరుద్ధరిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2021-22 ఏడాదికి మిగిలిన భాగం కోసం ఎంపీ లాడ్స్ పునరుద్ధరించారు. 2025-26 వరకు ఎంపీ లాడ్స్ పథకం కొనసాగనుంది. 2021-22లో మిగిలిన కాలానికి ఒక్కో ఎంపీకి రూ.2 కోట్ల చొప్పున కేటాయించారు. 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 వరకు ఏడాదికి రెండు విడతల్లో ఒక్కో ఎంపీకి రూ.5 కోట్ల చొప్పున కేటాయించారు.

కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి రూ. 2 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి నిధులను మంజూరు చేసేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి పూర్తిగా రూ. 5 కోట్లు ప్రతి ఎంపీకి అందుతాయని పేర్కొన్నారు. ఎంపీలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం వీటిని కేటాయించుకోవచ్చని చెప్పారు.

Mariamma Lockup Death : గుండె ఆగిపోయేలా కొడతారా?..మరియమ్మ లాకప్ డెత్ పై హైకోర్టు సీరియస్

దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి ఒక్కో ఎంపీకి రూ. 2 కోట్ల చొప్పున అందనున్నట్లు వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరం నుండి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు రెండు విడతలుగా ఒక్కో ఎంపీకి ఏడాదికి రూ. 5 కోట్ల చొప్పున నిధులు విడుదల చేయనున్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు.