Customer Mobile Number : సూపర్ మార్కెట్లలో బిల్లు చెల్లించేటప్పుడు.. కొనుగోలుదారుడి మొబైల్ నెంబర్, వ్యక్తిగత వివరాలు అడగొద్దు : కేంద్రం

ఈ మార్గదర్శకాలను పాటించాలని రిటైల్ ఇండస్ట్రీ, సీఐఐ, ఫిక్కీలను ఆదేశించింది. వినియోగదారుడి వ్యక్తిగత వివరాలు సేకరించడం గోప్యతా హక్కుకు భంగం కలిగించడమేనని ఆ శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.

Customer Mobile Number : సూపర్ మార్కెట్లలో బిల్లు చెల్లించేటప్పుడు.. కొనుగోలుదారుడి మొబైల్ నెంబర్, వ్యక్తిగత వివరాలు అడగొద్దు : కేంద్రం

Customer Mobile Number

Updated On : May 26, 2023 / 12:42 PM IST

Central Government : కేంద్ర ప్రభుత్వం సూపర్ మార్కెట్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బిల్లు చెల్లించేటప్పుడు కొనుగోలుదారుడి మొబైల్ నెంబర్, వ్యక్తిగత వివరాలు తీసుకోవద్దని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ రిటైల్ సంస్థలను ఆదేశించింది. ఇవ్వాల్సిందేనని కొనుగోలుదారుడిని ఒత్తిడి చేస్తే వినియోగదారుల రక్షణ చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

ఈ మార్గదర్శకాలను పాటించాలని రిటైల్ ఇండస్ట్రీ, సీఐఐ, ఫిక్కీలను ఆదేశించింది. వినియోగదారుడి వ్యక్తిగత వివరాలు సేకరించడం గోప్యతా హక్కుకు భంగం కలిగించడమేనని ఆ శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ఆన్ లైన్ మోసాలు, వాట్సాప్ మెస్సేజ్ లతో ఆర్థిక నేరాలకు ఆస్కారం కలుగుతుందన్నారు.

India Rs.75 Coin : నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా.. రూ.75 కాయిన్ ను విడుదల చేయనున్న కేంద్రం

దీనిపై తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. చట్టం ప్రకారం వినియోగదారుల మొబైల్ నెంబర్స్, వ్యక్తిగత వివరాలు సేకరించడం నేరమని పేర్కొన్నారు. వినియోగదారులపై ఒత్తిడి తేవడం సరి కాదన్నారు. వ్యక్తిగత ఫోన్ నెంబర్ తో బిల్లింగ్ చేయడం వెనుక ఎలాంటి హేతుబద్ధత లేదని స్పష్టం చేశారు.