EWS Quota: ఈడబ్ల్యూఎస్‌ కోటా రాజ్యాంగబద్ధమే.. సమర్ధించుకున్న కేంద్రం

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని గురువారం సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం బలంగా సమర్థించుకొంది. జనరల్‌ కేటగిరీలో పేదలు అధిక సంఖ్యలో ఉన్నారని, వారికి ప్రస్తుతం ఎలాంటి రిజర్వేషన్లు లేనందువల్ల వీటిని ఇవ్వాల్సి వచ్చిందని తెలిపింది. రిజర్వేషన్ల ఉద్దేశం కొన్ని వర్గాల సామాజిక ఉన్నతికి పరికరంగా ఉండడమే తప్ప ఆర్థికాభివృద్ధి కాదని వ్యాఖ్యానించింది. ఆర్థికంగా వెనుకబాటు అన్నది తాత్కాలికమని తెలిపింది

EWS Quota: ఈడబ్ల్యూఎస్‌ కోటా రాజ్యాంగబద్ధమే.. సమర్ధించుకున్న కేంద్రం

Union Govt defends EWS Quota in SC

Updated On : September 23, 2022 / 4:29 PM IST

EWS Quota: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని గురువారం సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం బలంగా సమర్థించుకొంది. జనరల్‌ కేటగిరీలో పేదలు అధిక సంఖ్యలో ఉన్నారని, వారికి ప్రస్తుతం ఎలాంటి రిజర్వేషన్లు లేనందువల్ల వీటిని ఇవ్వాల్సి వచ్చిందని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ జె.జి.పార్దీవాలాలతో కూడిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆరో రోజు కూడా వాదనలు ఆలకించింది. రిజర్వేషన్ల ఉద్దేశం కొన్ని వర్గాల సామాజిక ఉన్నతికి పరికరంగా ఉండడమే తప్ప ఆర్థికాభివృద్ధి కాదని వ్యాఖ్యానించింది. ఆర్థికంగా వెనుకబాటు అన్నది తాత్కాలికమని తెలిపింది. కాగా, ఏడవ రోజు (శుక్రవారం) సైతం ఈ విషయమై సుప్రీం విచారణ చేపట్టింది. ప్రస్తుతం ధర్మాసనం ముందు ఇరు వర్గాల వాదనాలు ఇంకా కొనసాగుతున్నాయి.

Cow-Dog Viral video: ఆవు మూతిని నోటితో పట్టేసిన కుక్క.. విడిపించడానికి అష్టకష్టాలు పడ్డ స్థానికులు