Cow-Dog Viral video: ఆవు మూతిని నోటితో పట్టేసిన కుక్క.. విడిపించడానికి అష్టకష్టాలు పడ్డ స్థానికులు

 దేశంలో ఇటీవలి కాలంలో పలు నగరాల్లో కుక్కలు మనుషుల వెంట పడి తీవ్రంగా గాయపర్చుతున్న ఘటనలు పెరిగిపోయాయి. అయితే.. తాజాగా ఓ కుక్క.. ఆవును కరిచి తీవ్రంగా గాయపర్చిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటుచేసుకుంది. ఓ ఆవు మూతిని గట్టిగా నోటితో పట్టేసి అస్సలు వదలలేదు ఓ పెంపుడు కుక్క. ఆవును కుక్క బారి నుంచి కాపాడడానికి అష్టకష్టాలు పడ్డారు స్థానికులు.

Cow-Dog Viral video: ఆవు మూతిని నోటితో పట్టేసిన కుక్క.. విడిపించడానికి అష్టకష్టాలు పడ్డ స్థానికులు

Cow-Dog Viral video

Cow-Dog Viral video: దేశంలో ఇటీవలి కాలంలో పలు నగరాల్లో కుక్కలు మనుషుల వెంట పడి తీవ్రంగా గాయపర్చుతున్న ఘటనలు పెరిగిపోయాయి. అయితే.. తాజాగా ఓ కుక్క.. ఆవును కరిచి తీవ్రంగా గాయపర్చిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటుచేసుకుంది. ఓ ఆవు మూతిని గట్టిగా నోటితో పట్టేసి అస్సలు వదలలేదు ఓ పెంపుడు కుక్క. ఆవును కుక్క బారి నుంచి కాపాడడానికి అష్టకష్టాలు పడ్డారు స్థానికులు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్మార్ట్ ఫోన్ లో చిత్రీకరించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ ఆవు మూతిని కుక్క నోటితో గట్టిగా పట్టేసి వదలలేదు. దాన్ని విడిపించడానిక కుక్క యజమాని ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. ఆ తర్వాత మరో ఇద్దరు వచ్చి విడిపించే ప్రయత్నం చేశారు. కర్రలతో కొట్టినా ఆ కుక్క వెనక్కు తగ్గలేదు.

చాలా సేపటి తర్వాత ఆవును కుక్క విడిచిపెట్టింది. కుక్క బారి నుంచి తప్పించుకుని ఆవు వెళ్లిపోయింది. ఆవుకి యాంటీ-రేబీస్ వ్యాక్సిన్ వేశామని వైద్య అధికారి ఆర్కే నారాయన్ తెలిపారు. కుక్కల బారి నుంచి ఇతర జంతువులను కూడా రక్షించుకోవాల్సిన అవసరం వస్తోంది.

Amit shah slams nitish kumar: ఇలాగైతే నితీశ్ బాబు దేశ ప్రధాని ఎలా కాగలరు?: అమిత్ షా