Medicine from the Sky : డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ల తరలింపు..ఐసీఎంఆర్‌కు అనుమతులు

మారుమూల ప్రాంతాలకు కూడా వ్యాక్సిన్లు అందేలా చేయడమే లక్ష్యంగా డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్స్ తరలింపుకు ప్రభుత్వం ఐసీఎంఆర్‌కు అనుమతులు ఇచ్చింది.

Medicine from the Sky : డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ల తరలింపు..ఐసీఎంఆర్‌కు అనుమతులు

Medicine From The Sky (1)

Updated On : September 14, 2021 / 12:32 PM IST

permits icmr to using drones to deliver vaccine : దేశమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కానీ మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్లు వెళ్లాలంటే అత్యంత కష్టంగా మారింది. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో నివసించే ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేయాలంలే వైద్య సిబ్బంది ఎంతో ప్రయాసతో చేరుకోవాల్సి వస్తోంది. ఈక్రమంలో తగినంత టెంపరేచర్ లో వ్యాక్సిన్ నిల్వ ఉండాల్సి వస్తోంది. కానీ మారుమూల ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఈ టెంపరేచర్ విషయంలో తేడాలు జరుగుతున్నాయి. దీంతో వ్యాక్సిన్లు పాడైపోతున్న పరిస్థితి. ఈ క్రమంలో వ్యాక్సిన్లను డ్రోన్ల ద్వారా తరలించే ప్రక్రియ దేశంలో తొలిసారిగా తెలంగాణలో జరిగింది.

Read more : Medicine From The Sky : దేశంలోనే తొలిసారి తెలంగాణలో డ్రోన్లతో వ్యాక్సిన్ల తరలింపు

ఈక్రమంలో మారుమూల ప్రాంతాలకు కొవిడ్‌ వ్యాక్సిన్లను తరలిచాలి. ఈ లక్ష్యంతోనే డ్రోన్లతో వ్యాక్సిన్లు చేరవేయాలని కేంద్ర పౌర విమానయానశాఖ నిర్ణయించింది. అండమాన్‌, నికోబార్‌ ద్వీపాలతో పాటు మణిపుర్‌, నాగాలాండ్‌లోని మారుమూల ప్రాంతాలకు కూడా డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లను తీసుకువెళ్లేలా భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)కి షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది.

రమారమి మూడు వేల మీటర్ల ఎత్తులో మాత్రమే ఈ డ్రోన్లను నడపాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల తెలంగాణలో ‘డ్రోన్ల ద్వారా ఔషధాల సరఫరా’ ప్రాజెక్టును ప్రారంభించిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనించాల్సిన విషయం.

Read more : Medicine From The Sky : దేశంలోనే తొలిసారి తెలంగాణలో డ్రోన్లతో వ్యాక్సిన్ల తరలింపు

డ్రోన్లతో వ్యాక్సిన్ల తరలింపుపై మంత్రి జ్యోతిరాదిత్య సింథియా మాట్లాడుతు ..విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని డిజిటల్ ఉయిర్ స్పేస్ మ్యాప్ ద్వారా అనుమతులు సులభతరం చేశామని వెల్లడించారు. డ్రోన్లకు అనుమతులు, నిర్వహణను సులభతరం చేశామని తెలిపారు.