Mansukh Mandavia
Odisha Train Accident : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్ల ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కేంద్ర ఆరోగ్యమంత్రి మన్ సుఖ్ మండవీయ ఒడిశాలో పర్యటిస్తున్నారు. ఒడిశా రైలు ప్రమాదంలో గాయపడిన బాధితులకు అందజేస్తున్న వైద్య సహాయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పరిశీలించనున్నారు.
ఎయిమ్స్ భువనేశ్వర్ కటక్‌లోని మెడికల్ కాలేజీని మాండవియా సందర్శించనున్నారు. రైలు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించి, వైద్యులతో ఆరోగ్యమంత్రి మాట్లాడనున్నారు. బలాసోర్ ప్రమాదంలో గాయపడిన వారికి వైద్య సహాయం కోసం ఇప్పటికే ఢిల్లీ, భువనేశ్వర్ ఎయిమ్స్ నుంచి వైద్య బృందాలు స్థానిక ఆసుపత్రులకు చేరుకున్నాయి.
Odisha Train Accident : కోరమాండల్, యశ్వంత్‌పూర్ హౌరా రైళ్లలో లభ్యంకాని 141 మంది ఏపీ ప్రయాణీకుల ఆచూకీ
భువనేశ్వర్ ఎయిమ్స్ లో ప్రస్తుతం 100 గుర్తుపట్టలేని మృతదేహాలు ఉన్నాయి. రైలు ప్రమాదంలో గుర్తుపట్టలేనంతగా శరీరాలు చిన్నాభిన్నమయ్యాయి. బాధితులను ఆస్పత్రులకు, స్వస్థలాలకు చేర్చేందుకు అంబులెన్సులు ఏపీ, తమిళనాడు నుంచి బలాసోర్ కు చేరుకున్నాయి. ఏపీ నుంచి బలాసోర్ ఫకీర్ మోహన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి 10 అంబులెన్స్ చేరుకున్నాయి.
Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదం.. విశాఖ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఒడిశాలోని బలాసోర్ సమీపంలో శుక్రవారం లూప్ లైన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలును షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది. దాని కంపార్ట్ మెంట్ లు మెయిన్ లైన్ పై పడ్డాయి. అయితే కొన్ని నిమిషాల్లోనే మెయిన్ లైన్ లో వచ్చిన యశ్వంత్ పూర్-హౌరా ఎక్స్ ప్రెస్, ఆ పట్టాలపై పడిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీలను ఢీకొని పట్టాలు తప్పింది.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 288 మంది మృతి చెందారు. మరో 803 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.