Odisha Train Accident : కోరమాండల్, యశ్వంత్‌పూర్ హౌరా రైళ్లలో లభ్యంకాని 141 మంది ఏపీ ప్రయాణీకుల ఆచూకీ

యశ్వంత్ పూర్ హౌరా రైలులో 41మంది ప్రయాణికులు విజయవాడ నుంచి బయలుదేరారు. ప్రమాదం నుంచి 21 మంది క్షేమంగా బయటపడ్డారు. ముగ్గురు ప్రయాణికులు ఆఖరి నిమిషంలో టిక్కెట్లు క్యాన్సల్ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

Odisha Train Accident : కోరమాండల్, యశ్వంత్‌పూర్ హౌరా రైళ్లలో లభ్యంకాని 141 మంది ఏపీ ప్రయాణీకుల ఆచూకీ

Odisha Train Accident

Coromandel Express: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్ల ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఆదివారం ఉదయం వరకు 288 మంది మరణించారు. మరో 900 మందికిపైగా గాయాలతో పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో వందల మృతదేహాలను ఉంచారు. అందులో తమవారిని గుర్తించేందుకు వచ్చిన కుటుంబ సభ్యుల రోధనలతో ఆ ప్రాంతం తీవ్ర విషాదాన్ని అలముకుంది. ఇదిలాఉంటే, కోరమాండల్, యశ్వంత్ పూర్ హౌరా రైళ్లలో ప్రయాణించిన ఆంధ్రప్రదేశ్ ప్రయాణీకుల లెక్క తేలింది. మొత్తం 479 మంది ఆ రెండు రైళ్లలో ప్రమాదం సమయంలో ప్రయాణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 316 మంది సురక్షితంగా బయటపడ్డారు. 141 మంది ఆచూకీ గల్లంతు కాగా, 22మంది క్షతగాత్రులుగా మారారు.

Odisha Train Accident : గతంలోనూ పలుసార్లు పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. ఆ సమయంలో ఎంత మంది మరణించారంటే?

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు రావాల్సిన 1‌35మంది ప్రయాణికుల్లో ఏడుగురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు గుర్తించారు. 80మంది ప్రయాణికులు క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రయాణం చేయని వారు 22 మంది ఉండగా.. 11మంది ఫోన్లు స్విచ్చాఫ్ చేయగా, తొమ్మిది మంది ఫోన్లు అందుబాటులో లేవని అధికారులు గుర్తించారు. మరో నలుగురు ఫోన్లు కాటాక్ట్‌లో లేదని, మరో నలుగురు ఫోన్ నెంబర్లు రాంగ్ నెంబర్‌గా వస్తున్నాయని అధికారులు గుర్తించారు. ఇదిలాఉంటే శనివారం రాత్రి ప్రత్యేక రైలులో తొమ్మిది మంది ప్రయాణీకులు విజయవాడకు చేరుకున్నారు.

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదం.. విశాఖ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

యశ్వంత్ పూర్ హౌరా రైలులో 41మంది ప్రయాణికులు విజయవాడ నుంచి బయలుదేరారు. ప్రమాదం నుంచి 21 మంది క్షేమంగా బయటపడ్డారు. ముగ్గురు ప్రయాణికులు ఆఖరి నిమిషంలో టిక్కెట్లు క్యాన్సల్ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇద్దరు ఫోన్ నెంబర్‌లు స్విచ్ ఆఫ్ వస్తుండగా, మరో ఇద్దరివి రాంగ్ నెంబర్‌ అని వస్తున్నాయి. ఎనిమిది మంది ఫోన్‌కు రెస్పాన్స్ కావడం లేదని, మరో నలుగురు అందుబాటులో లేరని పోలీసులు గుర్తించారు. ఒక వ్యక్తి ప్రయాణం చేయలేదు.

Odisha Train Accident: రైలు ప్రమాదం నుంచి బయటపడి సొంత ప్రాంతానికి తెలుగు యువకులు.. ఏం చెప్పారంటే..?

రైలు దుర్ఘటన ప్రభావం వల్ల రైళ్ల రాకపోకలకు మరో రెండు రోజులపాటు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఆది, సోమవారాల్లో రైల్వే అధికారులు పలు రైళ్లు రద్దు చేశారు. హైదరాబాద్‌ – షాలిమార్‌(18046), సంత్రగచి- తిరుపతి (22855) రైళ్లను ఆదివారం రద్దు చేశారు. తిరుపతి – సంత్రగచి(22856), హౌరా- బెంగళూరు(12245), షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌(12841), వాస్కోడగామా-హౌరా (18048), వాస్కోడగామా -కాచిగూడ(18048/17604), హౌరా-సికింద్రాబాద్‌ (12703)లను సోమవారం రోజున రద్దు చేశారు. వీటితో పాటు హౌరా- తిరుచి రాపల్లి(1263), ఆగర్తల-బెంగళూరు(12504)లను ఆదివారం ఖరగ్‌పూర్‌, టాటా నగర్‌, రూర్కెలా, జార్సుగూడల మీదుగా డైవర్షన్‌ చేశారు.