Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదం.. విశాఖ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

విశాఖ కలెక్టరేట్ లో అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విశాఖలో రైలు దిగాల్సిన ప్రయాణికులు 342 మంది ఉన్నట్లుగా గుర్తించారు.

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదం.. విశాఖ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Visakha Control Room

Visakha Collectorate Control Room : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్ల ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 288 మంది మృతి చెందగా, మరో 803 మందికి గాయాలు అయ్యాయి. విశాఖ కలెక్టరేట్ లో అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విశాఖలో రైలు దిగాల్సిన ప్రయాణికులు 342 మంది ఉన్నట్లుగా గుర్తించారు.

కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో 183 మంది, యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ లో ఉన్న 21 మంది సురక్షితంగా ఉన్నారు. ఇప్పటికే 41 మంది ప్రయాణికులు విశాఖ చేరుకున్నారు. ఇద్దరు క్షతగాత్రులకు సెవెన్ హిల్స్ లో చికిత్స అందిస్తున్నారు. అయితే, ఇంకా 63 మంది ఆచూకీ లభించలేదు. ఆచూకీ లభించని వారి వివరాల సేకరణలో అధికార యంత్రాంగం తలమునకలైంది.

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదం.. ఆంధ్రప్రదేశ్ ప్రయాణికుల వివరాలు వెల్లడి.. మొత్తం 178 మంది

ఒడిశాలోని బలాసోర్ సమీపంలో శుక్రవారం లూప్ లైన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలును షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది. దాని కంపార్ట్ మెంట్ లు మెయిన్ లైన్ పై పడ్డాయి. అయితే కొన్ని నిమిషాల్లోనే మెయిన్ లైన్ లో వచ్చిన యశ్వంత్ పూర్-హౌరా ఎక్స్ ప్రెస్, ఆ పట్టాలపై పడిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీలను ఢీకొని పట్టాలు తప్పింది.

ఈ ప్రమాదంలో 288 మంది దుర్మణం చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలంలో