Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదం.. ఆంధ్రప్రదేశ్ ప్రయాణికుల వివరాలు వెల్లడి.. మొత్తం 178 మంది

Odisha Train Accident : కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించిన తెలుగు ప్రయాణికులపై క్లారిటీ వచ్చింది. మొత్తం 178 మంది ప్రయాణికులు ఆంధ్రప్రదేశ్ లో దిగాల్సి ఉంది.

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదం.. ఆంధ్రప్రదేశ్ ప్రయాణికుల వివరాలు వెల్లడి.. మొత్తం 178 మంది

Odisha Train Accident – Andhra Pradesh : ఒడిశా రైలు ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 261 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఘటనా స్ఠలంలో సహాయక చర్యలు ముగిశాయి. తీవ్ర గాయాలతో వందల సంఖ్యలో ప్రయాణికులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee), రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఇప్పటికే ప్రమాదస్థలిని పరిశీలించారు.

కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (Coromandel Superfast Express) రైలులో ప్రయాణించిన తెలుగు ప్రయాణికులపై క్లారిటీ వచ్చింది. కోరమాండల్ రైలలో ఎక్కి ఆంధ్రప్రదేశ్ కు చేరాల్సిన ప్రయాణికుల వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 178 మంది ప్రయాణికులు ఆంధ్రప్రదేశ్ లో దిగాల్సి ఉంది. ఏసీ ఫస్ట్ క్లాస్ లో 9 మంది, ఏసీ 2 టైర్ లో 17, ఏసీ 3 టైర్ లో 114, స్లీపర్ క్లాస్ లో 38 మంది ప్రయాణికులు ఉన్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.

AP Passengers List

Odisha Train Accident coromandel express andhra pradesh passengers list

ప్రయాణికుల వివరాలు తెలిపేందుకు ఏపీలోని పలు జిల్లాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే తమ వారి వివరాల కోసం పాస్ పోర్ట్ ఫొటోలతో గ్రామ- వార్డు సచివాలయం, తహశీల్దార్ కార్యాలయంలో ప్రయాణికుల కుటుంబీకులు తక్షణం సంప్రదించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు కోరారు. పోలీస్ శాఖతో సమన్వయంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా సహాయ కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రయాణికుల వివరాల కోసం 1070, 112, 18004250101, 8333905022 నంబర్లలో సంప్రదించవచ్చు.

AP Passenger List

Odisha Train Accident coromandel express andhra pradesh passengers list

ఫోటో, వివరాలు వాట్సాప్ చేయండి
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి ఒడిశా రైలు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలకు ఆంధ్రప్రదేశ్ నుంచి బృందాలు ఘటనాస్థలికి వెళ్లాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రయాణికుల వివరాలను అధికారుల బృందాలు సేకరిస్తున్నాయని చెప్పారు. కలెక్టర్‌ కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశామని మంత్రి వనిత తెలిపారు. మిస్సయిన వారి సమాచారం కోసం 8333905022 నంబరుకు ప్రయాణికుని ఫోటో, ఇతర వివరాలు వాట్సాప్ చేయాలని సూచించారు.

సహాయక కేంద్రాల నంబర్లు
అన్నమయ్య జిల్లా: 08561 -293006
ఎన్టీఆర్ జిల్లా : 0866-2575833
అనంతపురం జిల్లా : 08554-220009, 8500292992
విశాఖపట్నం జిల్లా : 0891- 2590100/2590102
శ్రీకాకుళం జిల్లా: 08942-286213, 08942-286245
విజయనగరం జిల్లా: 08922-236947
తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ హెల్ప్ డెస్క్ : 08818-226212
గుంటూరు జిల్లా : 0863 2234014
మచిలీపట్నం పోలీస్ కంట్రోల్ రూమ్ : 9491068906, 9618336684, 8332983792

ప్రయాణికుల పూర్తి వివరాల కోసం ఈ కింది లింకులను క్లిక్ చేయండి. .

AP Passengers List – 1
AP Passengers List – 2
AP Passengers List – 3