Brahmin CM : బ్రాహ్మణుడిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నా- కేంద్రమంత్రి కోరిక

బ్రాహ్మణులను కేవలం కార్పొరేటర్ల గానో లేదా పౌర సంఘాల నేతలు గానో చూడాలనుకోవడం లేదు. ఓ బ్రాహ్మణుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపడితే చూడాలని కోరుకుంటున్నా"..

Brahmin Cm

Brahmin CM : అసలే హాట్ హాట్ గా మారిన మహారాష్ట్ర రాజకీయాలను కేంద్రమంత్రి రావు సాహెబ్ దాన్వే మరింత వేడెక్కించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టించే వ్యాఖ్యలు చేశారు. ఓ బ్రాహ్మణుడిని మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని తాను కోరుకుంటున్నా అని ఆయన తన మనసులో మాట బయటపెట్టారు. జాల్నాలో పరశురామ జయంతి సందర్భంగా బ్రాహ్మణ సామాజిక వర్గం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి రావు సాహెబ్ దాన్వే పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. స్థానిక సంస్థల్లో బ్రహ్మణులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని ఒకరు కేంద్రమంత్రిని కోరారు. దీనికి కేంద్ర మంత్రి రావుసాహెబ్ దాన్వే తనదైన శైలిలో స్పందించారు.

Hanuman Chalisa Row : ఎంపీ నవనీత్‌ కౌర్‌ దంపతులకు బెయిల్‌ మంజూరు

“బ్రాహ్మణులను కేవలం కార్పొరేటర్ల గానో లేదా పౌర సంఘాల నేతలు గానో చూడాలనుకోవడం లేదు. ఓ బ్రాహ్మణుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపడితే చూడాలని కోరుకుంటున్నా” అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. అంతేకాదు, తాను ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశానని, రాజకీయాల్లో కులతత్వం తీవ్రస్థాయిలో ఉన్న విషయం గుర్తించానని తెలిపారు. రాజకీయాల్లో కుల ప్రాబల్యాన్ని విస్మరించలేమని రావు సాహెబ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, అన్ని కులసంఘాలను కలుపుకుని పోయే నాయకుడు రావాలన్నారు కేంద్రమంత్రి దాన్వే.

బ్రాహ్మణుల్ని కులం పేరుతో పిలిస్తే ఏమీ అనుకోరు..కానీ శూద్రులు మాత్రం ఫీలైపోతారు : BJP ఎంపీ

కేంద్రమంత్రి దాన్వే వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. దీనిపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. ‘ ఎవరైనా సీఎం కావొచ్చు. ఓ ట్రాన్స్ జెండర్ అయినా సరే, మరెవరైనా సరే, ఏ కులానికి చెందినవారెవరైనా, ఏ మతానికి చెందిన వారైనా సరే… 288 సీట్లున్న అసెంబ్లీలో 145 మంది ఎమ్మెల్యేల బలం ఉంటే మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అయిపోవచ్చు’ అంటూ కేంద్రమంత్రికి కౌంటర్ ఇచ్చారు అజిత్ పవార్.