Hanuman Chalisa Row : ఎంపీ నవనీత్‌ కౌర్‌ దంపతులకు బెయిల్‌ మంజూరు

మహారాష్ట్ర ఎంపీ నవనీత్‌ కౌర్‌ రానా, ఆమె భర్త రవి రానాలకు ఊరట లభించింది. అరెస్ట్‌ అయ్యి జైల్లో ఉన్న ఆ జంటకు ఎట్టకేలకు బెయిల్‌ లభించింది.

Hanuman Chalisa Row : ఎంపీ నవనీత్‌ కౌర్‌ దంపతులకు బెయిల్‌ మంజూరు

Mumbai Court Has Granted Bail To Mp Navneet Kaur Rana Couple

Hanuman Chalisa Row : మహారాష్ట్ర ఎంపీ నవనీత్‌ కౌర్‌ రానా, ఆమె భర్త రవి రానాలకు ఊరట లభించింది. అరెస్ట్‌ అయ్యి జైల్లో ఉన్న ఆ జంటకు ఎట్టకేలకు బెయిల్‌ లభించింది. ముంబై సెషన్స్‌ కోర్టు బుధవారం (మే 4,2022) షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ సందర్భంగా నవనీత్ కౌర్ దంతపతులకు కొన్ని షరతులు విధించింది కోర్టు. మీడియాతో మాట్లాడవద్దని నవనీత్ కౌర్ దంపతులకు ఆదేశించింది న్యాయస్థానం. అలాగే నవనీత్ కౌర్ దంపతులకు 50 వేల పూచీకత్తు పై జస్టిస్ ఆర్ఎన్ రోకడే ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.

సీఎం ఉద్దవ్‌ థాక్రే ఇంటి ముందు హనుమాన్‌ చాలీసా పఠిస్తామంటూ ముంబైలో ఉద్రిక్తతలకు కారణం అయ్యారు ఈ ఇండిపెండెంట్‌ ఎంపీ, ఎమ్మెల్యే భార్యాభర్తలు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 23వ తేదీన ఖర్‌ స్టేషన్‌ పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బైకులా జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఈ జంట బెయిల్‌ కోసం ప్రయత్నిస్తూనే ఉంది.

Also read : navneet kaur: మహారాష్ట్రలో ఎంపీ, ఎమ్మెల్యే దంపతుల అరెస్టు

తమ అరెస్టు చట్టవిరుద్ధమని, చట్టానికి విరుద్ధంగా రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని రాణా దంపతుల వాదించారు. తమను అరెస్టు చేయడానికి ముందు పోలీసులు నోటీసులు అందలేదని, వ్యక్తులకు ద్వేషపూరిత భావాలను కలిగించే ఉద్దేశం తమకు లేదని వాదించారు. తమ వాక్ స్వాతంత్య్రాన్ని, భావప్రకటన స్వేచ్ఛను అణచివేయాలనే ఉద్దేశంతోనే దేశద్రోహం కేసు పెట్టారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ నవనీత్ కౌర్ రాణా దంపతులు.

ఎంపీ వాదనలను పోలీసులు ఖండించారు. హనుమాన్ చాలీసాను పఠిస్తున్నట్లు ప్రకటించడం మహారాష్ట్రలో శాంతిభద్రతలను దిగజార్చి, తద్వారా మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కుట్ర జరిపారని ముంబై పోలీసులు కోర్టుకు తమ వాదనలు వినిపించారు. అంతేకాదు శివసేన భాగస్వామ్యమైన రాష్ట్ర ప్రభుత్వం హిందువుల పట్ల విద్వేషపూరితంగా వ్యవహరిస్తోందని, హిందువులు తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించడం కష్టమని సాధారణ ప్రజల మనస్సుల్లో ముద్ర వేయడానికి హనుమాన్ చాలీసా అంశాన్ని లేవనెత్తారని ఆరోపించారు పోలీసులు.

Hanuman Chalisa Row : నవనీత్‌ కౌర్‌ దంపతులపై శివసేన ఎంపీ సంచలన ఆరోపణలు

నిందితులు ఎంపీ దంపతులు మాట్లాడే మాటలు భావప్రకటనా స్వేచ్ఛ యొక్క ప్రాథమిక హక్కు యొక్క సహేతుకమైన పరిమితులలో లేవని, అందువల్ల వారి చర్య సెక్షన్ 124A కింద నేరం పరిధిలోకి వస్తుందనిపోలీసులు
కోర్టుకు విన్నవించారు. ఇలా ఇరు వైపుల వాదనలు విన్న కోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంది.అనంతరం తరువాత రాణా దంపతులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసీన ముంబై సెషన్స్ కోర్టు. ఈసందర్భంగా కోర్టు ముంబై పోలీసులు నవనీత్ రాణా దంపతులను విచారణకు పిలవాలంటే 24 గంటల ముందు నోటీసులివ్వాలని సూచించింది.