HMPV Virus : భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం.. ఇద్దరు చిన్నారులకు పాజిటివ్.. అప్రమత్తమైన కేంద్రం

భారత్ లో వెలుగులోకి వచ్చిన రెండు హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

Union Ministry of Health has confirmed that two cases of HMPV have been reported in India

HMPV virus in India: చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం సృష్టిస్తున్న విషయం విధితమే. ఈ వైరస్ బారినపడి వేలాది మంది ఆస్పత్రుల బాటపడుతున్నారు. అయితే, తాజాగా భారత్ లోనూ హెచ్ఎంపీవీ కేసులు నమోదు కావటం ఆందోళనకు గురిచేస్తుంది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు వైరస్ సోకినట్లు నిర్దారించారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో మూడేళ్లు, ఎనిమిదేళ్ల వయస్సున్న చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దారించింది. ఈ వైరస్ కేసులు వెలుగులోకి వచ్చిన తరువాత కర్ణాటక ఆరోగ్య మత్రిత్వ శాఖ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఈ వైరస్ పట్ల ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది.

Also Read: HMPV Outbreak : చైనాను వణికిస్తోన్న హెచ్ఎంపీవీ.. ఇది కొత్త వైరస్ కాదా? కోవిడ్-19 పోలి ఉందా? ఏదైనా వ్యాక్సిన్ ఉందా?!

భారత్ లో వెలుగులోకి వచ్చిన రెండు హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా శ్వాసకోశ వ్యాధుల విషయంలో ఐసీఎంఆర్ సాధారణ పర్యవేక్షణలో భాగంగా రెండు కేసులు వెలుగు చూశాయని పేర్కొంది. హెచ్ఎంపీవీ భారతదేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా చెలామణిలో ఉంది. ఈ వైరస్ కు సంబంధించిన రెండు కేసులు భారత్ లోనూ గుర్తించడం జరిగింది. అయితే, ఈ రెండు కేసులలో ఇతర దేశాల నుంచి భారతదేశంకు వచ్చిన సమయంలో నమోదైన కేసులు కాదు. అంటే.. ప్రస్తుతం భారతదేశంలో నమోదైన రెండు హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులు చైనాలో నమోదైన కేసులకు ఎటువంటి సంబంధం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Also Read: HMPV Virus : 2025 అంతా నరకమేనా? బాబా వంగా, నోస్ట్రడామస్‌ చెప్పిందే నిజం అవుతుందా?

భారతదేశంలో హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్ కేసులు బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మూడేళ్ల నెలల బాలిక, ఎనిమిది నెలల బాలుడిలో గుర్తించడం జరిగింది. ఈ ఇద్దరు పిల్లల్లో న్యూమోనియా లక్షణాలు కనిపించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే, మూడు నెలల చిన్నారి వైరస్ నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. ఎనిమిది నెలల చిన్నారి చికిత్స పొందుతోందని తెలిపింది.