Covid Temple: మాస్క్‌ పెట్టుకుని మెసేజ్ ఇస్తున్న కరోనా మాత

మాస్క్ పెట్టుకుని మెసేజ్ ఇస్తున్నట్లుగా ఉన్న కరోనా మాత విగ్రహం అందరిని ఆకట్టుకుంటోంది. మహమ్మారికి గుడి కట్టి అందులో కరోనా మాతను ప్రతిష్టించి పూజిస్తున్నారు ప్రజలు. అంతేకాదు కరోనా మాతకు ప్రతీరోజు ప్రత్యేక పూజలు చేయటానికి ఓ పూజారిని కూడా నియమించారు.

Covid Temple: మాస్క్‌ పెట్టుకుని మెసేజ్ ఇస్తున్న కరోనా మాత

Up Corona Mata Temple Mask To Statue In Shuklapur Village

Updated On : June 12, 2021 / 11:58 AM IST

corona mata temple Mask to Statue : కరోనా వచ్చాక అందరం మాస్కులు పెట్టుకోవటం తప్పనిసరిగా పాటిస్తున్నాం. కానీ మాస్కులు పెట్టుకోవాలని..లేదంటే ప్రాణాలకే ప్రమాదమని జనాలకు థమ్కీ ఇచ్చిన కరోనా కూడా మాస్కు పెట్టుకుంది. అదేంటీ కరోనా అనేది ఓ వైరస్ కదా..అది మాస్కు పెట్టుకోవటమేంటీ? అనే డౌట్ వస్తుంది కదూ..అదేనండీ ఈ కరోనా కాలంలో ఆ మహమ్మారి నుంచి కాపాడాలంటే కరోనా విగ్రహాలు ప్రతిష్టించి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో కరోనాకే ఏకంగా గుడే కట్టేశారు ఉత్తరప్రదేశ్ లో. మహమ్మారి నుంచి కాపాడాలని కరోనాకు గుడికట్టిన పూజిస్తున్నారు ప్రతాప్‌గఢ్‌ జిల్లా శుక్లాపూర్‌ గ్రామ ప్రజలు.

కేవలం మన దేశంలోనే కాదు యావత్ ప్రపంచాన్నే కరోనా అనే మూడు అక్షరాలు గడగడలాడిస్తున్నాయి. ముఖ్యంగా మన దేశంలో ప్రతి రోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ‘‘కరోనా మాతా శాంతించు తల్లీ‘‘ అంటూ మహమ్మారికి గుడి కట్టి ఆ గుడిలో ‘కరోనా మాత’ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అంతేకాదు ప్రపంచాన్నే గడగడలాడించే ఆ కరోనాకు ‘మాస్కు’కూడా పెట్టారు. ప్రతీ రోజు పూజలు చేస్తున్నారు ప్రతాప్‌గఢ్‌ జిల్లా శుక్లాపూర్‌ గ్రామ ప్రజలు. ఈ ఆలయానికి ఓ పూజారిని కూడా నియమించారు.

కరోనా మాత విగ్రహానికి మాస్కు కూడా పెట్టి..అలాగే గ్రామస్తులంతా మాస్కులు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను కచ్చితంగా పాటించాలని కరోనా మాత సాక్షిగా తీర్మానించుకున్నారు.ప్రమాణాలు చేశారు.

ఈ కరోనా మాత గుడి గురించి ఆలయ పూజారి మాట్లాడుతూ..మా గ్రామంలో ఇటువంటి ఆలయం ఇదే మొదటిది కాదని.. గతంలో కూడా మసూచి పట్టిపీడించినప్పుడు కూడా మసూచి దేవాలయం కట్టుకున్నామని..ఇప్పుడు ప్రజలకు ప్రాంతకంగా మారిన కరోనా మాతను ప్రతిష్టించుకుని పూజిస్తున్నామని తెలిపారు.