UP Election Results : యూపీలో ఎస్పీ సత్తా చూపించాం.. బీజేపీ సీట్ల సంఖ్యను తగ్గించాం.. మా సీట్లు పెంచాం : అఖిలేశ్ యాదవ్
UP Election Results : యూపీలో బీజేపీ భారీ మెజార్టీతో రికార్డు స్థాయిలో విజయం సాధించింది. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ఎస్పీ గట్టిగానే పోటీనిచ్చింది.

Up Election Results Akhilesh Yadav Says We Showed That Bjp's Seat Count Can Be Decreased
UP Election Results : యూపీలో బీజేపీ భారీ మెజార్టీతో రికార్డు స్థాయిలో విజయం సాధించింది. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ చీఫ్ సారథ్యంలో ఎస్పీ గట్టిగానే పోటీనిచ్చింది. కానీ, యోగి ప్రభంజనానికి ఎస్పీ పార్టీ పాచికలు పారలేదు. యూపీ బీజేపీ విజయోత్సవాల్లో మునిగితేలుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన ఒక రోజు తర్వాత అఖిలేశ్ యాదవ్ యూపీ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఎస్పీ పార్టీకి మద్దతుగా ఓటేసిన ప్రజలందరికి అఖిలేశ్ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీతో ఎన్నికల పోరులో పరాజయం పాలైనప్పటికీ.. బీజేపీకి గట్టి పోటీనిస్తూ.. చాలా సీట్లను తగ్గించడంలో విజయవంతమయ్యాని అఖిలేశ్ అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ సత్తా ఏంటో చూపించామని, గతంలో కన్నా ఎస్పీ సీట్లు చాలా పెరిగాయని, భారీగానే ఓట్లను రాబట్టగలిగామని చెప్పుకొచ్చారు. ఇంతటితో తమ పోరాటం ముగియలేదని, రాబోయే రోజుల్లో బీజేపీపై తమ పార్టీ పోరాటం విస్తృత స్థాయిలో ఉంటుందన్నారు. అధికారమే లక్ష్యంగా ఎస్పీ పార్టీ ముందుకు సాగుతుందని అఖిలేశ్ స్పష్టం చేశారు. ఇప్పుడు బీజేపీ సీట్లను తగ్గించినట్టే.. భవిష్యత్తులోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని ట్విట్టర్ వేదికగా అఖిలేశ్ వ్యాఖ్యానించారు.
‘యూపీ ఓటర్లు ఎస్పీ సీట్ల సంఖ్యను రెండున్నర రెట్లు పెంచారు. ఎస్పీ ఓట్ల షేరింగ్‌లో ఒకటిన్నర రెట్లు పెరిగింది. మద్దతునిచ్చిన యూపీ ప్రజలకు కృతజ్ఞతలు’ అంటూ అఖిలేశ్ ట్వీట్ చేశారు. బీజేపీ సీట్ల సంఖ్యను తగ్గించి తామెంటో చూపించామన్నారు. బీజేపీ సీట్ల క్షీణత ఇలానే కొనసాగుతుందని తెలిపారు. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. అందులో బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి 273 సీట్లను గెలిచింది. అఖిలేశ్ యాదవ్ పార్టీ 111 సీట్లు గెలిచింది. గతంలో కన్నా ఎస్పీ సీట్లు భారీగా పెరిగాయన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వాన్ని బీజేపీ గద్దె దింపింది.
ఆ సమయంలో బీజేపీ సాధించిన సీట్ల కంటే 49 శాతం సీట్లు తగ్గాయి. ఇప్పడా సీట్లు ఎస్పీ ఖాతాలో పడ్డాయి. అఖిలేశ్ నేతృత్వంలోని కూటమి పార్టీ 125 స్థానాల్లో గెలిచింది. సొంతంగా 111 సీట్లు గెలుచుకోగా, దాని నేతృత్వంలోని కూటమి 125 స్థానాల్లో విజయం సాధించింది. 2017 ఎన్నికలలో ఎస్పీ గెలిచిన 73 స్థానాల నుంచి ఈ ఎన్నికల్లో అఖిలేశ్ పార్టీ 111 సీట్లకు చేరుకుంది. గతంలో ఎన్నడూ లేనంతగా అఖిలేశ్ యాదవ్ పార్టీ భారీగా ఓట్లను రాబట్టింది. యూపీలో భారీ మెజార్టీ ఓట్లను రాబట్టేందుకు అఖిలేశ్ పార్టీ బీస్పీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తు లేకుండానే పోటీలోకి దిగింది.
उप्र की जनता को हमारी सीटें ढाई गुनी व मत प्रतिशत डेढ़ गुना बढ़ाने के लिए हार्दिक धन्यवाद!
हमने दिखा दिया है कि भाजपा की सीटों को घटाया जा सकता है। भाजपा का ये घटाव निरंतर जारी रहेगा।आधे से ज़्यादा भ्रम और छलावा दूर हो गया है बाकी कुछ दिनों में हो जाएगा।
जनहित का संघर्ष जीतेगा!
— Akhilesh Yadav (@yadavakhilesh) March 11, 2022
యూపీ వ్యాప్తంగా ఎస్పీ భారీగా ప్రచారం నిర్వహించింది. 2017 ఎన్నికలలో మాదిరిగా కాంగ్రెస్‌తో లేదా 2019 ఎన్నికల్లోగా మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీతో అఖిలేశ్ పార్టీ పొత్తు పెట్టుకోలేదు. గతంలో ఈ రెండు పొత్తులతో ఎన్నికల్లో దిగిన ఎస్పీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఈసారి పొత్తులతో కాకుండా ఎస్పీ ఎన్నికల బరిలో నిలిచింది. బీజేకి వ్యతిరేకంగా ఎస్పీ తీవ్రంగా ప్రచారం నిర్వహించింది. బీజేపీని ఎలాగైనా ఈసారి యూపీ గద్దె దించాలని అఖిలేశ్ పార్టీ గట్టిగానే పోరాడింది. కానీ, యూపీ ప్రజలు మాత్రం యోగి నేతృత్వంలోని కాషాయ పార్టీకే పట్టం కట్టారు. ఎన్నికల ఫలితాల ప్రకారం.. సమాజ్ వాదీ పార్టీకి 32 శాతం వోట్ షేర్ రాగా.. బీజేపీకి 41 శాతం ఓట్లు వచ్చాయి. మొత్తంగా యూపీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. గతంలో కంటే ఎస్పీ పార్టీ భారీగానే ఓట్లను రాబట్టింది.
Read Also : UP Election : అఖిలేశ్ విఫలం కావడానికి కారణాలు ఏంటీ ?