Uttar Pradesh : నచ్చినమ్మాయి కోసం టవరెక్కిన యువకుడు..పెళ్లి చేస్తే దిగుతా లేకుంటే దూకుతానని హల్ చల్

ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారట.. ఓ యువకుడు 100 అడుగుల ఎత్తున్న మొబైల్ టవర్ ఎక్కాడు. ఆ తరువాత ఏం జరిగింది?

Uttar Pradesh : నచ్చినమ్మాయి కోసం టవరెక్కిన యువకుడు..పెళ్లి చేస్తే దిగుతా లేకుంటే దూకుతానని హల్ చల్

Uttar Pradesh

Uttar Pradesh : ఓ అమ్మాయిన ప్రేమించాడు.. ఆమెను పెళ్లి చేసుకుంటానంటే ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. అంతే 100 అడుగుల పొడవున్న మొబైల్ టవర్ ఎక్కేశాడు. ఆ తరువాత ఏం జరిగిందంటే?

Tamil Nadu : ముస్లిం అన్నదమ్ములను ప్రేమించిన అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు వద్దనడంతో ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్ లోని ఖుషీనగర్ కి చెందిన దిలీప్ 100 అడుగుల ఎత్తున్న మొబైల్ టవర్ ఎక్కేశాడు. అది చూసిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. దిలీప్‌ను క్రిందికి దింపేందుకు ప్రయత్నం చేశారు. ఎంత చెప్పినా దిలీప్ వినలేదు. గంట తర్వాత అతడిని కిందకు దించి జిల్లా ఆసుపత్రికి తరలించారు. తాను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, ఫ్యామిలీ మెంబర్స్ అంగీకరించడం లేదని దిలీప్ పోలీసులకు చెప్పాడు.

Suchitra Krishnamoorthi : ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. అయినా నా భర్తే నన్ను మోసం చేశాడు..

దిలీప్ అన్నయ్య అమర్జీత్ వెర్షన్ వేరేగా ఉంది. దిలీప్ మానసిక పరిస్థితి బాగా లేదని అందుకే ఇలా ప్రవర్తించాడని చెప్పాడు. ఇంతకుముందు దిలీప్ కొందరు వ్యక్తులతో గొడవ పడ్డాడని ఆ గొడవలో అతని తలకు గాయం అయ్యిందని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తుంటే పారిపోయాడని అన్నాడు. ఆ తరువాత గోరఖ్ పూర్ లో ఓ టవర్ ఎక్కుతున్నట్లు లెటర్ అందటంతో వెంటనే టవర్ వద్దకు వచ్చినట్లు అమర్జీత్ చెప్పాడు. ఇక వీరిద్దరి మాటల్లో ఎవరిది నిజం అనేది పోలీసులు తేల్చాలి.