Man Runs After Goat As It Escapes With Office Files
Man runs after goat as it escapes with office files : ఓ మేక ప్రభుత్వ ఉద్యోగులకు చెమటలు పట్టించింది. ఏకంగా గవర్నమెంట్ ఆఫీసుకు వచ్చి ఇంపార్టెంట్ ఫైల్స్ పట్టుకుపోయింది. దీంతో ఉద్యోగులు పరుగులు పెట్టారు. యూపీ కాన్పూర్‌లోని చౌబేపూర్ బ్లాక్ ఆఫీసులోకి వచ్చేసిన ఓ మేక అక్కడున్న ఫైల్ ను నోటితో పట్టుకుంది. మేక నోటిలో ఉన్న ఫైల్ ను చూసిన ఓ ఉద్యోగి..ఓరి నాయనో..అంటూ ఆ మేక వెనుకాలే పరుగులు పెట్టాడు. కానీ ఆ మేక చిక్కలేదు. బుధవారం (డిసెంబర్ 1,2021) జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read more : YV Subbareddy : రేపటి నుండి తిరుమలకు లింకు రోడ్డు ద్వారా వాహనాలకు అనుమతి : టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి
ఈ మేక గారి ఘనకార్యం వివరాల్లోకి వెళితే..చౌబేపూర్ బ్లాక్ ఆఫీసులోకి బుధవారం ఓ మేక వచ్చింది. ఆఫీసు క్యాంటిన్‌కు పక్కనే ఉణ్న రూమ్ లోకి వెళ్లిన ఆ మేక అక్కడున్న ఓ పైల్ ను నోటితో పట్టుకుని బయటకు వచ్చింది. కాసేపు అక్కడే నిల్చుంది. తరువాత ఎవరో వస్తున్న అలికిడికి దాన్ని పట్టుకు పరుగు పెట్టింది. అలా పరుగు పెడుతున్న మేకను ఓ ఉద్యోగి చూశాడు.దాని నోట్లో ఏదో ఉండటం చూశాడు. అది ఫైల్స్ ఉన్న రూమ్ లోంచి వచ్చిందనుకుని గమనించి దాని వెనకే పరుగు పెట్టాడు.
అలా వెళ్లగా వెళ్లగా చివరకు మేక నోట్లో ఉన్న ఫైల్‌ను ఎట్టకేలకు దొరికబుచ్చుకున్నాడు. కానీ అది ఫైల్ కాదు.. మామూలు కాగితమే అని తెలిసి ఓరీ నీ దుంప తెగ ఎంత హడలు పెట్టించావే..నీ వెనకాల పరుగులు పెట్టించావు కదే..అనుకుని తిరిగి ఆఫీసుకు వెళ్లిపోయాడు. అప్పటికే ఏదో ఫైన్ మేక పట్టుకుపోయిందని ఉద్యోగులందరు నానా హడావిడి పడిపోతున్నారు. అది ఏ ఫైల్ అయి ఉంటుందోనని తెగ ఆందోళన పడిపోతున్నారు. కానీ మేక పట్టుకెళ్లింది ఫైల్ కాదని ఓ చిత్తు కాగితమని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఉద్యోగుల నిర్లక్ష్యం వల్లే మేక.. కార్యాలయంలోకి ప్రవేశించిందని బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ మనులాల్ యాదవ్ అంటున్నారు.
कानपुर में बकरी सरकारी फ़ाइल चबाती भागी… पीछे अधिकारी भागा…
बकरी से फ़ाइल वापस ले पाया कि नहीं पता नहीं ? pic.twitter.com/QBD2owEoe8
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) December 3, 2021