YV Subbareddy : రేపటి నుండి తిరుమలకు లింకు రోడ్డు ద్వారా వాహనాలకు అనుమతి : టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి

తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడిన ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేయాలని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు.

YV Subbareddy : రేపటి నుండి తిరుమలకు లింకు రోడ్డు ద్వారా వాహనాలకు అనుమతి : టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి

Yv Subbareddy

Vehicles will be allowed to Thirumala : తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడిన ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేయాలని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు. ఇప్పటికిప్పుడు కొండచరియలు విరిగి పడే ప్రమాదం లేదని నిపుణులు తేల్చారని పేర్కొన్నారు. అత్యంత ప్రమాదకరంగా ఉన్న కొండ చరియల తొలగింపు కార్యక్రమాన్ని మూడు.. నాలుగు రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పారు.

కొండ చరియలు తొలగించే సమయంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా కెమికల్స్ ద్వారా వాటిని పగులగొట్టే అధునాతన టెక్నాలజీని వినియోగిస్తామని పేర్కొన్నారు. విరిగి పడేందుకు సిద్ధంగా ఉన్న కొండచరియల తొలగింపు కార్యక్రమాన్ని మూడు.. నాలుగు రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. తిరుమల రెండవ ఘాట్ రోడ్ లో రేపటి నుండి తిరుమలకు లింకు రోడ్డు ద్వారా వాహనాలను అనుమతిస్తామని చెప్పారు.

Corona Positive : హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన 12మంది విదేశీ ప్రయాణికులకు కరోనా పాజిటివ్

ఘాట్ రోడ్ లో మరమ్మతు పనులను మొదలు పెట్టి.. వీలైనంత త్వరగా నెల లోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశామని చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుమలకు మూడవ ఘాట్ రోడ్డు ఆలోచన మంచిదేనని చెప్పారు. మూడవ ఘాట్ రోడ్డు ఏర్పాటుపై కూడా ఆలోచన చేస్తామని తెలిపారు. అన్నమయ్య మార్గం అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉందన్నారు.