girls should carry knife for self defence : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టటానికి సీఎం యోగీ ఆదిత్యనాధ్ ప్రభుత్వం మిషన్ శక్తి కార్యక్రమ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలు, మహిళలతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలో మహిళలు, యువతులు రక్షణ కోసం కత్తులు తమ దగ్గర ఉంచుకోవాలని… అవసరమైనప్పుడు వాటిని వాడాలని రాష్ఠ్ర మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఓ కార్యక్రమంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.
https://10tv.in/former-m-p-cm-kamal-nath-makes-derogatory-statement-against-ex-cabinet-minister-imarti-devi/
లలిత్ పూర్ పోలీసు లైన్ లో జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ…..మహిళలు అవసరమైన సందర్బాల్లో కత్తులతో దాడులకు దిగాలని కూడా సూచించారు. ఆదిత్య నాధ్ ప్రభుత్వం మహిళల రక్షణ, భద్రత కోసం కట్టుబడి ఉందని…అత్యవసరమైన నెంబర్లు 112,1076, 181,1090 లకు ఫోన్ చేయమని మంత్రి తెలిపారు.
ఆదిత్యనాధ్ సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచక శక్తులను అణిచి వేస్తున్నారని చెప్పారు. మహిళలు ఆత్మరక్షణార్ధం …..మాన,ప్రాణాలను రక్షించుకోటానికి అవసరమైతే వారిని చంపటానికి కూడా వెనుకాడవద్దని దేవుడు అన్నీ పరిష్కరిస్తాడని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మంత్రి గారి వ్యాఖ్యలు రాష్ట్రంలో వివాదాస్పదమయ్యాయి.