కలియుగ కిష్టయ్య : ఒకే వ్యక్తిని పెళ్లిచేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు

Up three sisters married one man : సాధారణంగా భార్యలు భర్త ఏపనిచేసినా భరిస్తారు గానీ భర్తను మరో స్త్రీతో పంచుకోవటానికి ఏమాత్రం ఇష్టపడరు. ఒకవేళ భర్తకు వేరే స్త్రీతో సంబంధం ఉందని తెలిసినా..వేరే స్త్రీని పెళ్లి చేసుకున్నాడని తెలిసినా అస్సలు భరించలేదు. భర్తతో తగవు పెట్టుకుంటారు. కానీ ముగ్గురు అక్కాచెల్లెళ్లు మాత్రం ఒకే వ్యక్తిని పెళ్లిచేసుకున్నాడు.
అస్సలు గొడవలనేవే లేకుండా చక్కగా అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. ఆ అక్కాచెల్లెళ్ల మధ్య ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిలా వెలిగిపోతున్నాడు ఉత్తరప్రదేశ్ లోని ‘కృష్ణ’. ఆ శ్రీకృష్ణుడి భార్యలైనా గొడవలు పడ్డారు గానీ ఈ యూపీ అక్కా చెల్లెళ్లు మాత్రం చక్కగా ఒకరినొకరు అర్థంచేసుకుని భర్తను పువ్వుల్లో పెట్టుకుని మీర చూసుకుంటున్నారు. దీంతో కృష్ణ హాయిగా ముగ్గురు భార్యల ముద్దుల మొగుడిగా వెలిగిపోతున్నాడు. లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన కృష్ణ అనే వ్యక్తి కలియుగ కృష్ణుడు అంటుంటారు. అతను పెళ్లి చేసుకున్న ముగ్గురు అమ్మాయిల పేర్లు పింకీ, శోభ, రీనా. వారు ముగ్గురూ సొంత అక్కచెల్లెళ్లే. ఆ ముగ్గురు చిన్నప్పటి నుంచి ఏంచేసినా కలిసే చేయడం అలవాటు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లు పెళ్లి కూడా ఒక్కరినే చేసుకోవాలనుకున్నారు. అలా చిత్రకోట్ కు చెందిన కృష్ణను పెళ్లి చేసుకుని అన్యోన్యంగా కలిసి మెలిసి కాపురం చేసుకుంటున్నారు.
వీరి పెళ్లి జరిగి 12 ఏళ్లు అవుతోంది. కానీ ఇప్పటి వరకూ చిలిపి చిలిపి కలహాలు తప్ప పెద్దగా గొడవపడింది లేకపోవటం చాలా చాలా విశేషం. కృష్ణ ముగ్గురు భార్యలు ఇటీవల కర్వాచౌత్ పండుగ సందర్భంగా తమ భర్త కృష్ణ క్షేమం కోరుతూ చంద్రుడికి పూజలు చేశారు. ఆ తరువాత రాత్రి సమయంలో ఆనవాయితీ ప్రకారం జల్లెడ లోంచి తమ భర్తను చూస్తూ మురిసిపోయారు. దీనికి సంబంధించిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కృష్ణను ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు అంటూ ఆటపట్టిస్తుంటారు బంధువులు స్థానికులు.
కాగా, కృష్ణ తన భార్యలందరికీ సమాన న్యాయంచేస్తుంటాడు. కృష్ణకు మొత్తం ఆరుగురు పిల్లలు. ఒక్కో భార్యతో ఇద్దరు పిల్లలు. ఇలా అందరికీ న్యాయంచేశాడు. 12 ఏళ్ల నుంచి ఆ అక్కాచెల్లెళ్ల్ మధ్య గానీ..తనకు గానీ ఒక్కరోజు గొడవలు రాలేదట. వాళ్లందరూ చిత్రకోట్ లోని స్థానిక కంసీరామ్ కాలనీలో కలిసే ఉండటం మరో విశేషం.
కాగా రెండు కొప్పులు ఒకచోట ఇమడలేవని సామెత ఉంది. కానీ వీరి విషయంలో మాత్రం ఆ సామెత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను పనిచేయనేచేయవని చెప్పాలి. ఎందుకంటే వారి మధ్య ఈ 12 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా గొడవలు జరగకపోవటమే కారణం..ఇంతకంటే ఇంకేం చెప్పాలి వారి అన్యోన్యత గురించి..!!