Uttar Pradesh : సరయూ నదిలో ‘పానీ మే ఆగ్ లగాని హై’ అంటూ యువతి డ్యాన్సులు.. మండిపడుతున్న నెటిజన్లు

అయోధ్యలోని సరయూ నదిని రాముని పాదాలతో తడిసిన పుణ్య నదిగా భక్తులు భావిస్తారు. అలాంటి నదిలో ఓ యువతి డ్యాన్సులు చేయడం భక్తులకు ఆగ్రహం తెప్పించింది. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Uttar Pradesh : సరయూ నదిలో ‘పానీ మే ఆగ్ లగాని హై’ అంటూ యువతి డ్యాన్సులు.. మండిపడుతున్న నెటిజన్లు

Uttar Pradesh

Updated On : June 29, 2023 / 2:26 PM IST

Uttar Pradesh : సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలు ఇప్పుడు పాపులర్ అవుతున్నాయి. వైరల్ అవ్వాలన్న వ్యామోహంతో వివాహ వేదికలు, రైల్వే ప్లాట్‌ఫామ్‌లు, మెట్రోలు దేనిని జనం వదలట్లేదు. తాజాగా సరయూ నది ఘాట్‌లో ఓ యువతి డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది. దీనిపై పోలీసులు స్పందించారు.

Ayodhya Ram Mandir : అయోధ్య రామయ్య కోసం 108 అడుగుల పొడవు అగరుబత్తీ .. విశేషాలు ఎన్నో

సరయూ నదిలో పానీమే ‘పానీ మే ఆగ్ లగాని హై’ పాటకు ఉత్తరప్రదేశ్ యువతి డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీనిపై అనేకమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లటి దుస్తులు ధరించి స్టెప్పులు వేస్తూ ఆమె డ్యాన్స్ చేస్తుంటే ఆ దారిన వెళ్తున్న వారంతా డ్యాన్స్ చూస్తూ కనిపించారు.

Ayodhya: శరవేగంగా అయోధ్య రామాలయ నిర్మాణం.. దీపావళికి తొలి అంతస్తు సిద్ధం

అయోధ్యలోని సరయూనదిని శ్రీరామచంద్రుని పాదాలతో తడిసిన పుణ్యనదిగా భక్తులు భావిస్తారు.  నీటి  ప్రవాహంలో స్నానం చేస్తూ చాలామంది భక్తితో ధ్యానం చేస్తూ ఉంటారు. అనేకమంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వస్తుంటారు. అలాంటి చోట యువతి డ్యాన్స్ చేయడం చూసి స్ధానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె మతపరమైన సున్నితత్వాన్ని అవమానించిందని.. ప్రార్ధనా స్థలాల్లో నృత్యాలకు అనుమతి లేదని అయోధ్య ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ అన్నారు. నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.