ఉపహార్ థియేటర్ కేసు….అన్సాల్స్ బద్రర్స్ కు బిగ్ రిలీఫ్

1997లో ఢిల్లీలో వ్యాపారవేత్తలు సుశిల్,గోపాల్ అనాల్స్ కు చెందిన ఉపహార్ థియేటర్ దగ్గర జరిగిన అగ్ని ప్రమాద సంఘటనకు సంబంధించి సుప్రీం కోర్టు ఇవాళ(ఫిబ్రవరి-20,2020) కీలక తీర్పు ఇచ్చింది. థియేటర్ యజమానులకు విధించిన శిక్షను పొడిగించాలని కోరుతూ బాధితులు వేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే,జస్టిస్ ఎన్వీ రమణ,జస్టిస్ అరుణ్ మిశ్రాల నేతృత్వంలోని త్రిసభ్యధర్మాసనం కొట్టేసింది.
జూన్-13,1997న గ్రీన్ పార్క్ సమీపంలో ఉపహార్ థియేటర్‌లో హీందీ సినిమా”బోర్డర్” ప్రదర్శిస్తుండగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 59మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ ఘటనలో థియేటర్ యాజమానులైన గోపాల్ అన్సల్, సుశీల్ అన్సల్‌లపై కేసు నమోదైంది.
ఈ కేసులో 2015లో అన్సాల్ బ్రదర్స్ ను ట్రయల్ కోర్టు దోషులుగా ప్రకటించి రేండేళ్ల జైలు శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ అన్సల్ సోదరులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. రెండేళ్ల జైలు శిక్ష ఏడాదికి తగ్గించబడింది. కాగా, ఈ శిక్షను నిందితులు సుప్రీం కోర్టులో సవాలు చేయగా.. 60కోట్లు చెల్లిస్తే సరిపోతుందని, జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది.
అయితే వయసు దృష్ట్యా 2017లో సుశీల్ బన్సాల్‌కు జైలు శిక్ష నుంచి కోర్టు మినహాయింపు ఇచ్చింది. సుప్రీం తీర్పుపై భాదితుల సంఘం మరోసారి క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేయగా…నిందితులకు శిక్షను మరింత కాలం పొడగించలేమని పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.