న్యాయం కోసమే : అగ్రకులాల రిజర్వేషన్లు

  • Published By: veegamteam ,Published On : January 8, 2019 / 12:38 PM IST
న్యాయం కోసమే : అగ్రకులాల రిజర్వేషన్లు

అగ్రవర్ణ పేదలకు న్యాయం చేసేందుకునే ఈబీసీ రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చామని కేంద్ర సామాజిక న్యాయం శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ తెలిపారు. ఈ బిల్లు వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఎలాంటి నష్టం జరగదన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం, క్రిస్టియన్లకు కూడా రిజర్వేషన్ల వర్తిస్తాయని చెప్పారు. సామాజిక న్యాయం కోసమే ఈబీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చామన్నారు. రాజకీయలబ్ది కోసమే రిజర్వేషన్ ప్రతిపాదన తీసుకొచ్చారని విపక్షాలు చేసిన ఆరోపణలను మంత్రి ఖండించారు. లోక్‌సభలో కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన 124వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ మొదలైంది.

ఈబీసీ రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ స్పందించింది. ఎంతో కీలమైన బిల్లును ఎన్నికల ముందు హడావుడిగా తెచ్చారని కాంగ్రెస్ ఎంపీ రావత్ అన్నారు. ఇంత హడావుడిగా బిల్లును తేవాల్సిన అవసరం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు.

అగ్రకులాల్లో ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ బిల్లు చట్టంగా మారాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంది. ఈ రిజర్వేషన్‌కు సంబంధించి లోక్‌సభలో 124వ రాజ్యంగ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయసభల్లో 2/3 వంతు మెజారిటీ కావాలి.