ఏ అమెరికా ప్రెసిడెంట్ కు దక్కని ఆతిథ్యం

  • Published By: veegamteam ,Published On : February 25, 2020 / 05:15 AM IST
ఏ అమెరికా ప్రెసిడెంట్ కు దక్కని ఆతిథ్యం

Updated On : February 25, 2020 / 5:15 AM IST

రాష్ట్రపతి భవన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతులకు ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ట్రంప్‌ దంపతులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు, ప్రధాని నరేంద్ర మోడీ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ట్రంప్‌ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌, సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ దళాధిపతులు, కాన్సులేట్‌ సభ్యులను ట్రంప్‌కు మోదీ పరిచయం చేశారు. 

See Also>>ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్‌లో ట్రంప్‌ భార్య