సివిల్ సర్వీసెస్ అకాడమీలో 57 మంది ఆఫీసర్ ట్రైనీలకు కరోనా

  • Published By: sreehari ,Published On : November 22, 2020 / 09:21 AM IST
సివిల్ సర్వీసెస్ అకాడమీలో 57 మంది ఆఫీసర్ ట్రైనీలకు కరోనా

Updated On : November 22, 2020 / 11:08 AM IST

civil services academy : సివిల్ సర్వీసెస్ అకాడమీలో కరోనా కలకలం సృష్టించింది. ఉత్తరాఖండ్ లోని మస్సోరిలో లాల్ బహుదుర్ శాస్త్రి నేషనల్ అకడామీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA)లో శిక్షణ పొందుతున్న 57 మంది ట్రైనీ ఆఫీసర్లకు కరోనా పాజిటివ్ వచ్చయింది.



ఇప్పటివరకూ ఈ అకాడమీలో మొత్తం 24 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు ఒక నివేదిక వెల్లడించింది. కరోనా సోకిన ట్రైనీలను తమ కరోనా కేర్ సెంటర్‌లో క్వారంటైన్ చేసినట్టు LBSNAA అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేసింది. శుక్రవారం నుంచి RT-PCR టెస్టులను 162 పైగా నిర్వహించారు. దీనిపై ఇన్సిస్ట్యూట్ డైరెక్టర్ సంజీవ్ చోప్రా అందుబాటులో లేరు.



నవంబర్ 21న కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా అకాడమీలో 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ నిబంధనలకు సంబంధించి అన్ని చర్యలు చేపట్టినట్టు LBSNAA ట్వీట్ చేసింది.



ప్రోటోకాల్స్ లో భాగంగా భౌతిక దూరం, తరచుగా చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించేలా కఠిన ఆంక్షలను అమల్లోకి తెచ్చినట్టు ట్వీట్లో పేర్కొంది. 95వ వ్యవస్థాపక కోర్సులో క్యాంపస్ లో మొత్తంగా 428 మంది ట్రైనీలు శిక్షణ పొందుతున్నారు.

అకాడమీలో కరోనా కేసులను నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది. ఆఫీసర్ ట్రైనీల కోసం కేటాయించిన సిబ్బంది ఆహారం, ఇతర నిత్యావసరాలను పంపిణీ చేశారని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ వ్యాపించి ఉంటుందని చెప్పారు.