Vande Bharat Sleeper Train: వందే భారత్ స్లీపర్ రైలు.. లోపల సౌకర్యాలు ఎలా ఉన్నాయో చూడండి.. వావ్ అనాల్సిందే..
తొలి దశలో దేశవ్యాప్తంగా 30 స్లీపర్ రైళ్లు నడపాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.

Vande Bharat Sleeper Train: వందే భారత్ రైళ్లు.. భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ ఇది. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో సుదూర ప్రాంతాల ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని వందే భారత్‌లో స్లీపర్ వెర్షన్‌ను తెస్తున్నారు. ప్రపంచ స్థాయి అత్యాధునిక సౌకర్యాలతో స్లీపర్ రైళ్లను డిజైన్ చేస్తున్నారు. దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ఉత్తరప్రదేశ్ నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్లీపర్ రైలు ప్రయోగ దశలో ఉంది.
వందే భారత్ స్లీపర్ వెర్షన్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ రైలు లోపల సౌకర్యాలు చూస్తే వావ్ అనాల్సిందే. అంతేకాదు ఇకపై రైలు ప్రయాణం అద్భుతంగా మారిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పొచ్చు. నిర్మాణంలో ఉన్న వందే భారత్ స్లీపర్ ట్రైన్ లోపలి సౌకర్యాలు, ఇంటీరియర్, బెడ్లు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్టైలిష్ బెడ్లు, స్మార్ట్ లైటింగ్, సెల్ఫ్ కంట్రోల్ సీటింగ్ సిస్టమ్, నిశబ్ద ప్రయాణానికి ప్రత్యేక డిజైన్ ఇలాంటి ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చూస్తే.. మనం రైల్లో ఉన్నామా ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉన్నామా అన్న ఫీలింగ్ కలగడం ఖాయం.
ప్రస్తుతం చైర్‌కార్ వేరియంట్ లో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇవి సాధారణంగా రోజు వేళ ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. కానీ ఇప్పుడు.. రాత్రి పూట ప్రయాణించే వారికి సరికొత్త ఆప్షన్ అందుబాటులోకి రానుంది. వచ్చే నెల నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభం కానున్నాయి.
Also Read: వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై AI ఫొటోలు ఈజీగా క్రియేట్ చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ గైడ్..!
తొలి దశలో దేశవ్యాప్తంగా 30 స్లీపర్ రైళ్లు నడపాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. మొదటగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖ వంటి ప్రధాన నగరాల మధ్య ఈ ట్రైన్లు ప్రయాణిస్తాయి. ఈ రైళ్లు మేకిన్ ఇండియా కింద రూపుదిద్దుకుంటున్నాయి. చెన్నైలోని ICF ఫ్యాక్టరీలో కోచ్‌ల తయారీ శరవేగంగా జరుగుతోంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. టెక్నాలజీ, డిజైన్, సేఫ్టీ, శుభ్రత, సౌకర్యం ఇలా ఎందులో చూసుకున్నా అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయి. వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 20 కోచ్‌లు ఉంటాయి. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు రెండు జనరల్ AC ఫస్ట్, సెకండ్ థర్డ్ కాకుండా, రెండు సీటింగ్ కం లగేజీ కోచ్‌లు సైతం ఉంటాయి.
🚨 Vande Bharat sleeper trains to be operational from next month.
30 trains planned for FY26. pic.twitter.com/5LFTa6bCUj
— Indian Tech & Infra (@IndianTechGuide) June 17, 2025